
నోట్ల రద్దు వ్యవహారం దేశాన్ని ఎంతలా ఊపేస్తోందో తెలిసిందే. ఎక్కడ చూసినా టాపిక్ అదే. దీనిపై కొందరు పాజిటివ్‌గా ఉంటే.. మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. సామాన్యుడి కనీస అవసరం తీరని, తీర్చని నిర్ణయాలుంటే ఎంత? లేకుంటే ఎంత అంటున్నారు. ఇక, కొందరైతే మాత్రం తమ..తమ సృజనాత్మకతను అంతా ఉపయోగించి డైలాగులు రాసేస్తున్నారు. ఫన్నీ వీడియోలు తీస్తున్నారు. ఆ కోవలోనే మరో వీడియో చేరిపోయింది. ఆ వీడియో ఏదో కాదు.. ఇటీవల అనేక వివాదాలను మూటగట్టుకుని విడుదలైన ఏ దిల్ హై ముష్కిల్ సినిమా. ఆ సినిమాలోని కొన్ని సన్నివేశాలను తీసుకుని నోట్ల రద్దుపై స్పూఫ్ చేసి యూట్యూబ్‌లో పెట్టేశారు. అందులో అనుష్క పాత వెయ్యినోటు అని, అదే ఐశ్వర్య అయితే కొత్త రెండు వేల రూపాయల నోటు అని కంపేర్ చేస్తూ వీడియోను తీశారు. వెయ్యి నోటును తీసుకోవాలా? రెండు వేల రూపాయలు తీసుకోవాలా? అన్న సందిగ్ధతలో హీరో ఉండేలా చేస్తూ డైలాగులు సృష్టించారు. ఇప్పుడా వీడియో యూట్యూబ్‌లో హల్‌చల్ చేస్తోంది. ఎంతైనా క్రియేటివిటీ కదా!!!
No comments:
Post a Comment