Nestham Movie Creations

Tuesday, 15 November 2016

ఇలాంటి టైంలో ఎక్కడికి పోతాడో..


ఎలాంటి పోటీ లేనప్పుడు కూడా ఓ సినిమా రిలీజ్ కి భయపడాల్సి వస్తుందనే పరిస్థితిని ఓ వారం క్రితం ఏ సినిమా ఇండస్ట్రీ కూడా ఆలోచించి ఉండదు. పక్క పరిశ్రమల సంగతి పక్కన పెట్టి.. టాలీవుడ్ సంగతి వరకూ చూసినా.. ఈ వారం విడుదలకు షెడ్యూల్ చేసిన సినిమాల్లో 'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఒక్కటే క్రేజీ ప్రాజెక్ట్. అల్లరి నరేష్ నటించిన డైరక్ట్ మూవీ 'ఇంట్లో దెయ్యం నాకేం భయం'.. బిచ్చగాడు హీరో విజయ్ యాంటోనీ నటించిన డబ్బింగ్ సినిమా 'భేతాళుడు'.. ఇప్పటికే వాయిదా వేసేసుకున్నారు అన్నది నోట్ చేసుకోవాల్సిన పాయింట్. నిఖిల్ తప్ప వేరే ఎవరూ అసలు సినిమా విడుదల చేయాలంటేనే భయపడే పరిస్థితి. దీనికంతటికీ కారణం కేంద్రం పెద్ద నోట్లపై రద్దు విధించడమే. ఆ.. ఇదేం ఉందిలే.. సినిమా టికెట్ కి పెట్టే వందకి పెద్ద పట్టింపు ఏముందిలే అనే ఉద్దేశ్యంతో గతవారం రిలీజ్ అయిన నాగచైతన్య మూవీ 'సాహసం శ్వాసగా సాగిపో' చిత్రం పరిస్థితి చూస్తే.. కేంద్రం తీసుకున్న డెసిషన్ పవర్ అర్ధమవుతుంది. ఒక్క రోజులో రాబట్టగల వసూళ్లు రాబట్టడానికి దాదాపు వీకెండ్ మొత్తం పట్టింది. అయినా సరే.. నిఖిల్ ఏ మాత్రం తగ్గకపోవడం ఆశ్చర్యకరమే. టాలీవుడ్ ని దృష్టిలో పెట్టుకుంటే ఒకరకంగా నిఖిల్ చేస్తున్నది ఒక రకంగా కరెక్టే అయినా.. ఏదైనా తేడా వస్తే సినిమాకి వచ్చే లాస్ ని ఎవరూ భర్తీ చేయలేరన్న మాట వాస్తవం. మరి 'చిన్నోడు ఎక్కడికి పోతాడో' తెలియాలంటే శుక్రవారం వరకూ ఆగాల్సిందే.

No comments:

Post a Comment

About

Flickr