Nestham Movie Creations

Thursday, 17 November 2016

బ్రేకింగ్ న్యూస్.. రహస్యంగా పెళ్లి చేసుకున్న నయనతార!


నయనతార ప్రేమ, పెళ్లి గురించి తాజాగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. దాదాపుగా ఏడెనిదేళ్ల నుంచి శింబు, ప్రభుదేవా వంటి స్టార్ హీరోలతో ప్రేమయాణం నడిపిన నయన్.. వాళ్లతో పెళ్లి పీటలు ఎక్కబోతుందంటూ కొన్నాళ్లూ, పెళ్లి ఎక్కేసిందంటూ కొన్నాళ్లూ వార్తలు హల్‌చల్ చేశాయి. అయితే, చిట్టచివరకు ఆ ఇద్దరి హీరోలతో నయన్ విడిపోవడం సినిమాలపై దృష్టి పెట్టి సక్సెస్‌లు అందుకోవడం చూస్తూనే ఉన్నాం. అయితే, ప్రభుదేవాతో పెళ్లి వ్యవహారం తరువాత తమిళ సినీ పరిశ్రమకు చెందిన విఘ్నేశ్ శివన్‌తో ప్రేమలో పడిందని, వాళ్లిద్దరూ రహస్యంగా సహజీవనం చేస్తున్నారని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. అయితే, ఈ జంట గురించి తాజాగా మరో షాకింగ్ వార్త తమిళ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది. నయనతార విఘ్నేశ్‌ను రహస్యంగా పెళ్లి చేసుకుందని, అయితే, తన కెరీర్, మీడియా నుంచి దూరంగా ఉండడానికి ఈ విషయాన్ని రహస్యంగా ఉంచిందనేది ఆ వార్త సారాంశం. ఈ వ్యవహారం ఇరు కుటుంబాల్లో తెలుసని, పెద్దలు ఈ జంటకు మద్దతుగా ఉన్నారని చెబుతున్నారు. ఇటీవల ఓనమ్ పండుగను శివన్‌లో కలిసి చేసుకున్న నయన్ ఆ ఫొటోలను సోషల్ మీడియాతో పోస్ట్ చేయడంతో ఆ ఫొటో ఆధారంగా చేసిన పరిశోధనలో ఈ విషయం బయటపడినట్లు చెప్పుకుంటున్నారు. కొంతకాలం పాటు ఇలా సహజీవనం చేస్తున్నట్లుగానే నటించి మంచి సమయం చూసి ప్రకటించాలనేది ఈ జంట ప్లాన్ అట. శివన్‌తో పెళ్లి కావడం వల్లే.. తను నటించిన సినిమాల ప్రమోషన్లకు, ఇతర కార్యక్రమాలకు దూరంగా ఉంటోందని కూడా కోలీవుడ్ జనాలు చెప్పుకుంటున్నారు.

No comments:

Post a Comment

About

Flickr