Nestham Movie Creations

Sunday, 13 November 2016

శరత్ కుమార్ మీద విశాల్ కేసు!


తమిళ సినిమా నటుల గొడవ ఇప్పట్లో చల్లారేటట్లు లేదు. నడిగర్ సంఘం వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఎన్నికలు ముగిశాక కూడా ఆరోపణలు.. ప్రత్యారోపణలు.. పరస్పర ఫిర్యాదులు.. కేసులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఎన్నికల అనంతరం కూడా శరత్ కుమార్ మీద విశాల్ ఆరోపణలు గుప్పించడం.. విశాల్ మీద శరత్ కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం శరత్ కమార్ మీద విశాల్ పోలీస్ కేసు పెట్టబోతున్నాడట. నడిగర్ సంఘం అధ్యక్షుడిగా ఉన్నపుడు శరత్ కుమార్.. సంఘంలో మరో కీలక పదవిలో ఉన్న మరో సీనియర్ నటుడు రాధారవి కలిసి అక్రమాలకు పాల్పడినట్లు విశాల్ గుర్తించాడట. నడిగర్ సంఘానికి చెందిన ఓ స్థలాన్ని వాళ్లిద్దరూ అక్రమంగా సొంతం చేసుకున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో శరత్ కుమార్.. రాధారవిల మీద పోలీసులకు ఫిర్యాదు చేసి.. కేసు పెట్టడానికి రెడీ అవుతున్నట్లు తమిళ సినీ వర్గాలు చెబుతున్నాయి. ఇదే జరిగితే విశాల్-శరత్ కుమార్ మధ్య శతృత్వం మరో స్థాయికి చేరినట్లే. శరత్ కుమార్ కూతురైన వరలక్ష్మిని ప్రేమిస్తూ ఆమెతో పెళ్లికి రెడీ అవుతూనే తన మామ మీద పోరాటాన్ని విశాల్ కొనసాగస్తూనే ఉండటం ఆశ్చర్యం కలిగించే విషయమే. ఐతే విశాల్ తన మీద కేసు పెట్టే పక్షంలో తాను కూడా అతడిపై తీవ్రంగా స్పందిచాలని.. ఎదురుదాడి చేయాలని శరత్ భావిస్తున్నాడట. ఇటీవల పైరసీ విషయంలో నిర్మాతలపై విశాల్ తీవ్ర విమర్శలు గుప్పించిన నేపథ్యంలో అతడిపై నిషేధం వేయించడానికి తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాడట శరత్.

No comments:

Post a Comment

About

Flickr