Nestham Movie Creations

Wednesday, 16 November 2016

మహేష్‌-కొరటాల సినిమాలో హీరోయిన్‌ ఎవరో తెలుసా?


ఓ స్టార్‌ హీరో, ఓ స్టార్‌ డైరెక్టర్‌ కలిసి పనిచేయబోయే సినిమాలో సాధారణంగా స్టార్‌ హీరోయిన్‌కే స్థానం దక్కుతుంది. అయితే మహేష్‌తో చేయబోయే సినిమా కోసం దర్శకుడు కొరటాల శివ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా అప్‌కమింగ్‌ బ్యూటీ కీర్తి సురేష్‌ను తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇటీవల విడుదలైన ‘రెమో’ సినిమాలో కీర్తి సురేష్‌ నటన కొరటాలను ఇంప్రెస్‌ చేసిందట. అందుకే మహేష్‌ సినిమాలో నటిస్తావా? అని కీర్తికి ఆఫర్‌ ఇచ్చాడట. మహేష్‌ వంటి స్టార్‌ హీరో సినిమాలో చేయడానికి ఎవరు అభ్యంతరం చెబుతారు. అందుకే కీర్తి కూడా వెంటనే ఒకే చెప్పేసిందట. ఈ సినిమాతో కీర్తి సురేష్‌ ఇమేజ్‌ ఎక్కడికో వెళ్లిపోతుందన్నమాట.

No comments:

Post a Comment

About

Flickr