Nestham Movie Creations

Friday, 18 November 2016

గురు సినిమాలో పవన్ ఫ్యాన్‌గా నటిస్తున్నదెవరు?


ప్రస్తుతం సెట్స్‌లో షూటింగ్ జరుపుకుంటున్న ఆ సీనియర్ హీరో సినిమాలోని ఒక అమ్మాయి.. మరో హీరోకు అభిమానిగా కనిపించనుందట. క్రేజీ హీరో ఇమేజ్‌ను క్యాష్ చేసుకోవడానికే ఇలా చేశారని కొందరంటుంటే... అంతా రీమేక్ స్టోరీ ప్రకారమే జరుగుతోందని మరికొందరు చర్చించుకుంటున్నారట. 'బాబు బంగారం' తరువాత ప్రయోగాత్మకంగా 'సాలా ఖద్దూస్' రీమేక్‌ను ఎంచుకున్నాడు సీనియర్ హీరో వెంకటేశ్. అంతేకాదు అందుకోసం తన బాడీ లుక్‌ను పూర్తిగా మార్చేశాడు. సుధా కొంగర డైరెక్షన్‌లో శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న 'గురు' అనే ఈ నయా మూవీని జనవరిలో ఆడియెన్స్ ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. కేవలం వెంకటేశ్ సీన్లను షూట్ చేసి మిగతా సీన్లను యథాతథంగా మాతృక నుంచి తీసుకుంటారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ముఖ్యపాత్ర పోషించిన రితిక సింగ్... పవన్ కళ్యాణ్ ఫ్యాన్‌గా కనిపించబోతోందనే న్యూస్ టాక్ ఆఫ్ ది టౌన్‌గా మరింది. కోలీవుడ్ రీమేక్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా తమిళ వర్షన్‌లో రితిక సింగ్... ధనుష్ ఫ్యాన్‌గా కనిపిస్తుంది. దీంతో తెలుగులో ఆమెను ఏదో ఒక హీరోకు అభిమానిగా చూపించాల్సి రావడంతో... పవన్ కళ్యాణ్ అభిమానిగా చూపించాలని డిసైడయ్యారట దర్శకనిర్మాతలు. ఇప్పటి స్టార్ హీరోల్లో భారీ ఫాలోయింగ్ ఉన్న పవన్‌కు వెంకటేశ్‌కు మధ్య మంచి ఫ్రెండ్ షిప్ ఉండటం వల్లే ఇలా చేశారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాతో ప్రముఖ మెజీషియన్ పీసీ సర్కార్ కూతురు ముంతాజ్ సర్కార్ టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందట. నయా మూవీలో ఆమెది కూడా ఓ ముఖ్యమైన పాత్ర అని సినీ జనం చర్చించుకుంటున్నారు. మొత్తానికి 'బాబు బంగారం'తో ఆశించిన స్థాయి విజయాన్ని అందుకోలేకపోయిన వెంకీ...'గురు' వంటి ప్రయోగాత్మక చిత్రంతో హిట్ కొడతాడేమో చూడాలి.

No comments:

Post a Comment

About

Flickr