Nestham Movie Creations

Thursday, 17 November 2016

తమిళ దర్శకుడిని ఓకే చేసిన ఎన్టీఆర్ ?


ntr next movie with harintr next movie with hari ఈ ఏడాది నాన్నకు ప్రేమతో,జనతా గ్యారేజ్ లాంటి బ్లాక్ బస్టర్స్ తో టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన జూనియర్ ఎన్టీఆర్ తన తర్వాతి చిత్రం ఏ దర్శకుడితో చేయనున్నాడనే దానిపై అభిమానులలో సందిగ్ధం నెలకొంది. త్రివిక్రమ్ , అనీల్ రావిపూడి లాంటి పలువురు దర్శకుల పేర్లు వినిపించిన దీనిపై పూర్తి క్లారిటీ రావడం లేదు. ఇటీవల త్రివిక్రమ్, జూనియర్‌ని కాదని పవన్ కళ్యాణ్‌తో మూవీ స్టార్ట్ చేశాడు. దాంతో.. జూనియర్ నెక్స్ట్ మూవీ ఎవరితో చేయబోతున్నాడనేది మిస్టరీగా మారింది. కొందరు మాత్రం ఎన్టీఆర్ తర్వాతి చిత్రం అనీల్ రావిపూడి దర్శకత్వంలో ఉంటుందనే కాన్ఫిడెంట్ తో ఉన్నారు. కాని తాజాగా ఈ రేసులోకి సింగం సిరీస్ డైరెక్టర్ హరి వచ్చి చేరాడు. ఇటీవల సూర్యతో సింగం 3 చిత్రాన్ని చేసిన హరి ఈ మూవీని డిసెంబర్ 16న రిలీజ్ కి సిద్దం చేశాడు. ఇప్పుడు ఎన్టీఆర్ తో ఓ సినిమా చేయాలని హరి భావించాడట. ఈ క్రమంలో తన దగ్గర ఉన్న ఓ స్టోరీని తారక్ కి వినిపించాడట. పోలీస్ స్టోరీ నేపథ్యంలో ఉన్న ఈ స్టోరీ ఎన్టీఆర్ కి నచ్చడంతో వెంటనే ఓకే అనేశాడట. త్వరలో వీరిద్దరి కాంబినేషన్ లో ఓ పవర్ ఫుల్ చిత్రం పట్టాలెక్కనుందని చెబుతున్నారు.

No comments:

Post a Comment

About

Flickr