Nestham Movie Creations

Sunday, 13 November 2016

పాత‌నోట్ల‌తో ఆ "సుఖం" అందిస్తున్నారు

పాత‌నోట్ల‌తో ఆ
పెద్ద నోట్ల ర‌ద్దు దేశవ్యాప్తంగా కుదిపేస్తున్న సంగ‌తి తెలిసిందే. చెత్త‌కుప్ప‌లు, మురికి కాలువ‌లు, మంటల్లో కాలిపోవ‌డం ఇవీ ప్ర‌స్తుతం రూ.500, రూ.1000 నోట్ల కేరాఫ్ అడ్ర‌స్‌లు. విలువైన నోట్లు ఇలా వ్య‌ర్థ‌మైపోవ‌డానికి అనేక కార‌ణాలున్నాయి. అయితే పాత‌నోట్ల‌కు ఊహించ‌ని ఆఫ‌ర్ ఒక‌టి వ‌చ్చింది. ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఏదైనా ప్ర‌క‌ట‌నా అని ఊహించేసుకోకండి. పాత‌నోట్ల‌తో కూడా 'సుఖాన్ని' అందించేందుకు దేశంలోనే ద‌క్షిణాసియాలోనే అతిపెద్ద వేశ్య‌వాటిక‌గా పేరొందిన క‌ల‌క‌త్తాలోని సోనాగ‌చ్చీ సెక్స్ వ‌ర్క‌ర్లు ముందుకు వ‌చ్చారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో గ‌త రెండ్రోజుల్లో ఇక్క‌డ భారీగా శృంగార వ్యాపారం పెరిగిపోయింది కూడా! రూ.500, రూ.1000 నోట్ల రద్దు నేప‌థ్యంలో సోనాగ‌చ్చీలోని మ‌హిళా సెక్స్ వ‌ర్క‌ర్ల‌ల కోసం ప‌నిచేస్తున్న ఎన్జీవో ఒక‌టి కీల‌క సూచ‌న చేసింది. పాత నోట్ల‌ను స్వీక‌రించి కూడా తాము శృంగారానికి అంగీక‌రిస్తామ‌ని, ఇలా వారంపాటు త‌మ‌కేం ఇబ్బంది లేకుండా సంభోగంలో పాల్గొంటామ‌నేది ఆ ప్ర‌క‌ట‌న సారాంశం. ఇంకేం ఈ ప్ర‌కట‌న ఆనోటా, ఈనోటా పెద్ద ఎత్తున్నే చెలామ‌ణిలోకి వెళ్లిపోయింది. అస‌లే నోట్ల‌ను ఏం చేయాల‌నే ఆలోచ‌న‌తో వేడెక్కిపోతున్న నోట్ల బాబులు త‌మ "వేడి"ని ఈ రూపంలో త‌గ్గించుకోవాల‌నుకున్నారో లేక‌పోతే అందివ‌చ్చిన అవ‌కాశాన్ని వ‌దులుకోవద్ద‌ని భావించారో తెలియ‌దు కానీ...సోనాగ‌చ్చీకి ఎగ‌బ‌డిపోయారు. దీంతో రెండ్రోజుల్లోనే సాధార‌ణం కంటే రెట్టింపు స్థాయిలో విటులు అక్క‌డికి వెళ్లి సుఖాన్ని ఆస్వాదించారు. ఇలా పాత నోట్ల‌కు వాళ్ల‌కు విముక్తి దొరికింది విటుల రాక‌తో గిరాకి కూడా ఊహించ‌ని విధంగా పెరిగింద‌ని స‌ద‌రు ఎన్జీవో సంస్థ విశ్లేషిస్తోంది

No comments:

Post a Comment

About

Flickr