Nestham Movie Creations

Saturday, 12 November 2016

కామెడీ తీయడం తెలియని డైరెక్టర్ని-రాజమౌళి


కామెడీ తీయడం తెలియని డైరెక్టర్ని-రాజమౌళితనకు కామెడీ తీయడం చేతకాదని అన్నాడు రాజమౌళి. ‘కామెడీ తీయడం తెలియని డైరెక్టర్ని’ అంటూ తన మీద తానే సెటైర్ వేసుకున్నాడు రాజమౌళి. ‘జ్యో అచ్యుతానంద’ ఆడియో వేడుకలో భాగంగా యాంకర్ సుమ రాజమౌళికి ఓ చిన్న క్విజ్ లాంటిది పెడుతూ.. ముందు ఆయన గురించి ఉపోద్ఘాతం ఇచ్చింది. ‘‘జనాలు పాప్ కార్న్ కోసం కూడా బయటకు వెళ్లకుండా చేసే డైరెక్టర్.. ప్రేక్షకులు సీట్లకు అతుక్కుపోయేలా చేసే డైరెక్టర్..’’ అంటూ సుమ పొగుడుతుంటే.. రాజమౌళి అందుకుని ‘‘కామెడీ తీయడం చేతకాని డైరెక్టర్’’... అంటూ తన మీద తాను సెటైర్ వేసుకున్నాడు. ఐతే సుమ మాత్రం ఆయన తీసిన కామెడీ గురించి కూడా ప్రస్తావిస్తూ ఆయన్ని పొగిడింది. దీని తర్వాత రాజమౌళి-సుమ మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. తాను నాలుగు ప్రశ్నలు అడుగుతానని.. అందులో మొదటి ప్రశ్నకు సమాధానం చెప్పకూడదని.. రెండో ప్రశ్నకు తొలి ప్రశ్న సమాధానాన్ని ఇవ్వాలని.. అలాగే మూడో ప్రశ్నకు రెండో ప్రశ్న సమాధానం.. నాలుగో ప్రశ్నకు మూడో ప్రశ్న సమాధానం చెప్పాలని సుమ అంది. ముందుగా బాహుబలి ఏ సంవత్సరంలో విడుదలవుతుందో ఆ సంవత్సరం చివరి అంకెలు చెప్పమని అడిగింది సుమ. అన్న ప్రకారమే.. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పలేదు రాజమౌళి. ఆ తర్వాత యాంకర్ సుమ వయసెంత అని అడిగింది సుమ. దానికి 17 (ముందు ప్రశ్న సమాధానం) అని జవాబిచ్చాడు రాజమౌళి. తర్వాత బాహుబలికి మీరు ఇంకా తీయబోయే సీక్వెల్స్ ఎన్ని అని అడిగింది. ‘జీరో’ అనేసి.. సుమ వయసెంతో నాకు తెలియదు అని నవ్వేశాడు. చివరగా అవసరాల శ్రీనివాస్ తో ఎన్ని సినిమాలు చేయాలనుకుంటున్నారు అని అడిగితే.. ‘‘ఓ ఏడెనిమిది..’’ అన్నాడు రాజమౌళి. ఈ సంభాషణ జరుగుతున్న టైంలో ఆడిటోరియం నవ్వులతో హోరెత్తింది. 

1 comment:

About

Flickr