Nestham Movie Creations

Sunday, 13 November 2016

వెంకీ సినిమాలో పవన్ కళ్యాణ్!


విక్టరీ వెంకటేష్ కొత్త సినిమా.. గురు. తమిళం సూపర్ హిట్టయిన ‘ఇరుదు సుట్రు”కు ఇది రీమేక్. బాక్సర్ గా తాను సాధించలేనిది తన శిష్యులతో సాధించాలని తపించే ఒక కోచ్.. మట్టిలో మాణిక్యం లాంటి ఓ అమ్మాయిని గుర్తించి ఆమెను బాక్సింగ్ లోకి తీసుకొచ్చి ఛాంపియన్ ను చేసే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. వెంకీ బాక్సింగ్ కోచ్ పాత్రలో నటిస్తుంటే ఆయన శిష్యురాలిగా రితికా సింగ్ నటిస్తోంది. మాతృతను రూపొందించిన తెలుగమ్మాయి సుధ కొంగరనే తెలుగు వెర్షన్ ను కూడా రూపొందిస్తోంది. ఈ సినిమాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తావన చాలాసార్లు వస్తుందని సమాచారం. ‘గురు”లో కథానాయిక పవన్ కళ్యాణ్ అభిమానిగా కనిపిస్తుందట. తమిళంలో కథానాయికను ధనుష్ ఫ్యాన్ గా చూపించారు. తెలుగులో పవన్ అభిమానిగా మార్చారు. వెంకీకి.. పవన్ కళ్యాణ్ తో మంచి అనుబంధం ఉంది. ఇద్దరూ కలిసి ‘గోపాల గోపాల” సినిమా కూడా చేశారు. ఈ నేపథ్యంలో హీరోయిన్ని ఎవరి అభిమానిగా చూపిద్దాం అన్న చర్చ వచ్చినపుడు వెంకీనే పవన్ పేరు సూచించాడట. గత కొన్నేళ్లలో పవన్ ఇమేజ్ అమాంతం పెరిగింది. ఒకప్పుడు మెగాస్టార్ చిరంజీవి రెఫరెన్సులు వేరే సినిమాల్లో ఎలా ఉండేవో ఈ మధ్య పవన్ ప్రస్తావన కూడా అలాగే ఉంటోంది. మరి ‘గురు”లో పవన్ పేరును ఎలా వాడుకుంటారో చూడాలి.

No comments:

Post a Comment

About

Flickr