Nestham Movie Creations

Thursday, 17 November 2016

అర్ధరాత్రుల్లో షూటింగ్ చేస్తోన్న శృతి


sruthi posts Burning the midnight oiఅందాల భామ శృతి హాసన్ తాజాగా పవన్ కళ్యాణ్ క్రేజీ ప్రాజెక్ట్ కాటమరాయుడు చిత్రంలో కథానాయికగా నటిస్తోన్న సంగతి తెలిసిందే. డాలీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాలలలో షెడ్యూల్ జరుపుకుంటోన్న ఈ చిత్రంకు సంబంధించిన కీలక సన్నివేశాలను రాత్రి వేళలలో తెరకెక్కిస్తున్నారట. దీనిపై శృతి ఓ ఫోటో పోస్ట్ చేస్తూ వెరైటీ కామెంట్ పెట్టింది. యాష్ ట్యాగ్ తో వర్క్ మోడ్, గ్రేయార్డ్ షిఫ్ట్, మేకింగ్ మూవీస్, హ్యపీ టూ బీ అనే కామెంట్ పెట్టింది. అంటే దెయ్యాలు తిరిగే టైంలో షూట్ చేస్తున్నామని, ఈ చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని తెలిపింది శృతి. గబ్బర్ సింగ్ లో పవన్ తో కలిసి నటించగా, ఇప్పుడు కాటమరాయుడు చిత్రంలోను నటిస్తుండడం తనను ఆనందానికి గురి చేస్తోందని శృతి పేర్కొంది. నార్త్ స్టార్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై శరత్ మరార్ నిర్మిస్తోన్న ఈ సినిమా ఉగాది శుభాకాంక్షలతో మార్చి 29, 2017న విడుదల కానున్నట్టు తెలుస్తోంది. శృతి నటించిన ప్రేమమ్ చిత్రం పెద్ద హిట్ కాగా త్వరలో సింగం 3తో మరోసారి ప్రేక్షకుల ముందుకు రానుంది.

No comments:

Post a Comment

About

Flickr