Nestham Movie Creations

Saturday, 12 November 2016

చిన్నారి పెళ్లికూతురు కాక పుట్టిస్తోందిగా...

చిన్నారి పెళ్లికూతురు కాక పుట్టిస్తోందిగా...!
అతి చిన్న వయసులోనే.. రావాల్సిన దానికంటే ఎక్కువ ఇమేజ్ నే సంపాదించుకుంది అవికాగోర్ అలియాస్ చిన్నారి పెళ్లికూతురు. పదేళ్లు కూడా నిండకుండానే బాలికా వధు సీరియల్ తో ఇండియన్ వైడ్ గా పాపులర్ అయింది ఈ భామ. ఇక ఇప్పుడు 18 ఏళ్లకే హీరోయిన్ అయిపోయి తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఉయ్యాలా జంపాలా, సినిమా చూపిస్త మావా లాంటి సినిమాలతో తెలుగులో మంచి ఇమేజ్ తెచ్చుకుంది అవికా. అయితే సినిమాల్లో నటిస్తున్నా.. ఇప్పటి వరకు గ్లామర్ షోలో మాత్రం హద్దులు దాటలేదు అవికా గోర్. గ్లామర్ ఇండస్ట్రీలో ఉంటూ అందాలు ఆరబోయకపోతే నెగ్గుకు రావడం కాస్త కష్టమని ఇప్పుడిప్పుడే చిన్నారి పెళ్లికూతురికి తెలిసొస్తున్నట్లుంది. అందుకే తాను గ్లామర్ షోకు సిద్ధమంటూ దర్శకనిర్మాతలకు హింట్ ఇస్తోంది ఈ బ్యూటీ. ఈ మధ్య బయటి ఫంక్షన్ లకు వస్తున్నపుడు చిట్టి పొట్టి డ్రస్సుల్లో దర్శనమిస్తోంది. దీనికి తోడు ఈ మధ్య కాలంలో బరువు బాగా తగ్గిపోయింది ఈ ముద్దుగుమ్మ. సన్నబడిన తన అందాన్ని చిట్టి పొట్టి కాస్ట్యూమ్స్ లో కెమెరాలకు వలేస్తుంది చిన్నారి పెళ్లికూతురు. అయితే ఎంత వేడెక్కించినా.. ఈ భామ మొహంలో ఇంకా చిన్నిపిల్ల లక్షణాలు అలాగే ఉన్నాయంటున్నారు. మరి హాట్ హాట్ గా కనిపిస్తున్న అవికాలోని గ్లామరసాన్ని మనకందించే దర్శకుడు ఎవరో చూడాలి

1 comment:

About

Flickr