Nestham Movie Creations

Monday, 14 November 2016

యాంకర్ అనసూయ పెడితే అది బుంగమూతి... నువ్వు పెడితే అది బొంగులో మూతి...


Anchor Anasuyaయాంకర్‌ కమ్‌ నటి అనసూయను పబ్లిసిటీ కోసం తెగ వాడేసుకుంటున్నారు సినీ జనాలు. జబర్‌దస్త్‌లో ప్రతి స్కిట్‌లోనూ ఆమెను ఇన్‌డైరెక్టుగా పేరును వుపయోగిస్తుంటారు. ఇటీవలే ఓ ఎపిసోడ్‌లో బుంగమూతి పెడితే.. అనసూయలా పెట్టాలి. నువ్వు పెడితే బొంగులోమూతి అంటారని.. ఓ భర్త భార్యతో అన్న ఎపిసోడ్ ఉదాహరణ. Anchor Anasuya ఇలాంటివి ఆమెపై తెగ రాసేస్తున్నారు రచయితలు. అయితే ఇప్పుడు సినిమాలో కూడా ఆమె గ్లామర్‌ను వాడుకుంటున్నారు. 'క్షణం', 'సోగ్గాడే చిన్నినాయనా' సినిమాల్లో పోషించిన పాత్రలతో మరింత క్రేజ్‌‌ను సొంతం చేసుకుంది. అలాంటి అనసూయ సాయిధరమ్‌ తేజ్‌తో కలిసి ఐటమ్‌ సాంగ్‌ చేయనుంది. కాగా, గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సాయిధరమ్‌ తేజ్‌ కథానాయకుడిగా 'విన్నర్‌' సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాలో ''అనసూయ .. అనసూయ ..'' అంటూ ఆమెపైనే సాగే ఐటమ్‌ సాంగ్‌ వుంది. ప్రస్తుతం ఈ సాంగ్‌ను ఉక్రెయిన్‌‌లో చిత్రీకరిస్తున్నారు. కొడితే బూరల గంపలో పడడం అంటే ఇదేమరి.

No comments:

Post a Comment

About

Flickr