
ఇప్పటికే ఇద్దరు భామలు విదేశీ గడ్డపై జెండా ఎగరేస్తుంటే... మరో బీ-టౌన్ బ్యూటీకి కన్ను కుట్టేస్తోందట. అందుకే అర్జెంట్‌గా హాలీవుడ్‌కు టికెట్ బుక్ చేసుకుందట. ఇంతకూ ఎవరా భామ?
నిన్నమొన్నటివరకూ తన కళ్లముందే ఉన్న దీపిక పదుకొనే, ప్రియాంకా చోప్రా ఉన్నట్లుండి హాలీవుడ్‌లో పాపులారిటీ తెచ్చుకోవడంతో బాలీవుడ్ ఫ్యాషనిస్ట్ సోనమ్ కపూర్‌కు అసలు నిద్రపట్టడం లేదట. ఇదే విషయంపై కొన్నాళ్లుగా తర్జనభర్జనలు పడుతున్న సోనమ్ ఎట్టకేలకు ఓ నిర్ణయానికి వచ్చేసిందట.
ఆ మధ్య డిప్స్, పీసీపై ఒకింత ఈర్ష్యను వెళ్లగక్కిన సోనమ్... ఇక తాను కూడా హాలీవుడ్ ఫ్లైట్ ఎక్కేయాలని ఫిక్స్ అయిందట. ఇదే విషయాన్ని కొన్ని రోజుల క్రితం మీడియాకు వెల్లడించిన సోనమ్... ఇతర హీరోయిన్లు మాదిరి గుట్టుగా ఆఫర్లు పట్టేసి ఆఖరి నిమిషంలో హాలీవుడ్ ఎంట్రీని అనౌన్స్ చేయడం తనకిష్టం లేదని దీపికకు డైరెక్ట్‌గా చురకేసింది. డిప్స్ లాస్ట్ మినిట్ వరకూ తన హాలీవుడ్ ఎంట్రీపై గోప్యత పాటించిన సంగతి తెలిసిందే.
ఇక దీపిక, ప్రియాంక మాదిరిగానే హాలీవుడ్‌లో ఆఫర్లు చేజిక్కించుకునేందుకు ఓ అంతర్జాతీయ సంస్థతో ఒప్పందం చేసుకుందట సోనమ్. ప్రస్తుతం ఈ పని నిమిత్తమే అమెరికా వెళ్లిన అమ్మడు... ఈ నెలాఖరు వరకూ అక్కడే ఉండి పలుపురు హాలీవుడ్ దర్శకులు, నిర్మాణ సంస్థలతో చర్చలు జరపబోతోందట. మరి తిరిగి వచ్చేటప్పుడు అమ్మడు గుడ్ న్యూస్‌ను మోసుకొస్తుందో లేదో చూడాలి.
No comments:
Post a Comment