
కెరీర్ మొదట్లో క్రేజ్ కోసం బికినీలో అందాలు ఆరబోసిన ఆ బ్యూటీ... టాప్ లీగ్‌లోకి ఎంటరయ్యాక ఇప్పటి వరకూ ఆ ఫీట్‌ను రిపీట్ చేయని అమ్మడు తాజాగా మరోసారి బికినీ వేయబోతోందట. ఇంతకూ ఎవరా బినికీ బేబీ?
తెలుగులో పెద్దగా హడావిడి చేయకపోయినా... కోలీవుడ్‌లో నయనతార హవా బాగానే కొనసాగుతోంది. ప్రస్తుతం సౌత్ ఇండియాలోనే బిజీయెస్ట్ హీరోయిన్‌గా మారిపోయిన ఈ భామ... ఎంత టాప్ పొజిషన్‌కు చేరుకున్నా అందాల ఆరబోతకు ఏమాత్రం హద్దులు విధించలేదు.
సీనియర్ హీరోలను పక్కన పెట్టి కుర్ర హీరోలకే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్న నయన్... ఈ మధ్య హీరోయిన్ ఓరియెంటెడ్ చిత్రాలకు పెద్ద పీటే వేస్తోంది. తాజాగా కోలీవుడ్ అప్‌కమింగ్ హీరో అథర్వకు జోడీగా 'ఇమైగా నోడిగల్' అనే చిత్రంలో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నయన్... స్క్రిప్ట్ డిమాండ్ మేరకు మరోసారి టూ పీస్ వేసేందుకు సై అందట.
గతంలో నయన్ 'బిల్లా' సినిమాలో తొలిసారి బికినీ వేసింది. టూపీస్ బికినీలో అందాలు ఆరబోసి థియేటర్లలో సెగలు పుట్టించింది. ఈ దెబ్బకు అమ్మడు టాప్ లీగ్‌లోకి దూసుకుపోయిన వైనం అందరికీ తెలిసిందే. అయితే కెరీర్ పీక్ పొజిషన్‌కు చేరుకున్న ఈ టైమ్‌లో... అదీ అధర్వ లాంటి మీడియం హీరో సినిమాలో అమ్మడు ఈ స్థాయిలో అందాలు ఆరబోసేందుకు సిద్ధపడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. మరి ఈసారి నయన్ బికినీ ట్రీట్ ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి.
No comments:
Post a Comment