Nestham Movie Creations

Sunday, 13 November 2016

ట్విట్టర్లో సమంత గ్రేట్ అచీవ్‌మెంట్


ట్విట్టర్లో సమంత గ్రేట్ అచీవ్‌మెంట్సమంత రూత్ ప్రభుకు సౌత్ ఇండియన్ ట్విట్టర్ క్వీన్ అని కిరీటం పెట్టేయొచ్చేమో. మన హీరోయిన్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఆమె ఏకంగా 3 మిలియన్ మార్కును అందుకుంది. ట్విట్టర్లో గత కొన్నేళ్లలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో దూసుకెళ్లిన సమంత 30 లక్షల మంది ఫాలోవర్లను సంపాదించుకుంది. కొన్నాళ్ల ముందు వరకు త్రిష ఆమె కంటే ముందుండేది. ట్విట్టర్లో ముందు అడుగుపెట్టింది కూడా త్రిష. ఐతే ప్రస్తుతం త్రిష ఫాలోవర్ల సంఖ్య 2.9 మిలియన్ల వద్ద ఉండగా.. సమంత ఆమె కంటే ముందు 3 మిలియన్ మార్కును టచ్ చేసింది. ట్విట్టర్లో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండటం.. తరచుగా అభిమానులతో చిట్ చాట్లు చేయడం.. సరదా ట్వీట్లు చేయడం ద్వారా సమంత బాగా పాపులర్ అయింది. ట్విట్టర్లో సమంత కంటే ముందున్న సౌత్ సెలబ్రెటీ రజినీకాంత్. ఆయన ఫాలోవర్ల సంఖ్య 3.2 మిలియన్లు. మహేష్ బాబు.. సమంత కంటే వెనుకే ఉన్నాడు. ప్రిన్స్ ఫాలోవర్ల సంఖ్య 2.5 మిలియన్లు. రాజమౌళి ఫాలోవర్లు 2.4 మిలియన్లున్నారు. రామ్ గోపాల్ వర్మ.. రానా దగ్గుబాటి.. ఇద్దరూ సమానంగా 2.1 మిలియన్ ఫాలోవర్లతో కొనసాగుతున్నారు. అక్కినేని నాగార్జున 1.8 మిలియన్లతో ఉండగా.. సమంతను చేసుకోబోయే నాగచైతన్య 4.25 లక్షల ఫాలోవర్లతో కొనసాగుతున్నాడు. అల్లు అర్జున్ ఈ మధ్యే మిలియన్ మార్కును టచ్ చేశాడు. పవన్ కళ్యాణ్ మిలియన్ మార్కుకు చేరువగా ఉన్నాడు. ఇండియాలో అత్యధిక ఫాలోవర్లను కలిగిన సెలబ్రెటీ అమితాబ్ బచ్చనే. ఆయన ఈ మధ్యే 23 మిలియన్ (2.3 కోట్ల మంది) మార్కును అందుకోవడం విశేషం

No comments:

Post a Comment

About

Flickr