Nestham Movie Creations

Sunday, 13 November 2016

రోబో-2 హోరు మొద‌లైందిగా..


రోబో-2 హోరు మొద‌లైందిగా..ఇండియాస్ కాస్ట్లీయెస్ట్ ఫిల్మ్ '2.0' ప్ర‌చార హోరు మొద‌లైన‌ట్లే ఉంది. ఇప్ప‌టిదాకా ప్రారంభోత్స‌వ ఫొటోలు.. లీక్డ్ పిక్స్.. ఫ్యాన్ మేడ్ లోగోలు మాత్ర‌మే చూశాం. ఇప్పుడిక అధికారికంగా రోబో సీక్వెల్ '2.0' ప్ర‌చార జోరుకు శ్రీకారం చుట్టేస్తున్నాడు ఏస్ డైరెక్ట‌ర్ శంక‌ర్. స‌రిగ్గా ఇంకో వారం రోజుల్లోనే '2.0' ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ప్రేక్ష‌కుల ముందుకొచ్చేస్తోంది. ఇప్ప‌టిదాకా ఇండియాలో ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ కోసం ఎన్న‌డూ లేనంత హంగామా చేయ‌బోతోంది '2.0' యూనిట్. ఫ‌స్ట్ లుక్ లాంచ్ కోసం ముంబ‌యిలో భారీ ఏర్పాట్లే చేశారు. అతిర‌థ మహారథుల మ‌ధ్య భారీ స్క్రీన్ మీద '2.0' ఫ‌స్ట్ లుక్ లాంచ్ చేయ‌బోతున్నారు. 'బాహుబ‌లి-2' ఫ‌స్ట్ లుక్ లాంచ్ కంటే కూడా ఈ కార్య‌క్ర‌మాన్ని పెద్ద ఎత్తున చేసి.. దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశం చేయ‌డానికి '2.0' నిర్మాత‌లు ప్లాన్ చేశారు. మొద‌ట్నుంచి '2.0' ప్రోగ్రెస్ గురించి త‌న‌దైన శైలిలో అప్ డేట్స్ ఇస్తున్న శంక‌ర్.. ఫ‌స్ట్ లుక్ విష‌యంలోనూ ట్విట్ట‌ర్లో ఓ అప్ డేట్ ఇచ్చాడు. '2.0' ఫ‌స్ల్ లుక్ లోడింగ్ 10 ప‌ర్సెంట్ అంటూ.. ఫ‌స్ట్ లుక్ లాంచ్‌కు తొమ్మిది రోజులుండ‌గా ట్వీట్ చేశాడు. అంటే రోజుకు ప‌ది శాతం చొప్పున ప‌ది రోజుల‌కు 100 ప‌ర్సెంట్ లోడ్ అయిపోయి.. న‌వంబ‌రు 20న ఫ‌స్ట్ లుక్ రెడీ అయిపోతుంద‌న్న‌మాట‌. ఐతే '2.0' ఫ‌స్ట్ లుక్ ఇప్పుడే వ‌చ్చేస్తున్నా.. సినిమా రావ‌డానికి మాత్రం ఇంకా 10-12 నెల‌ల దాకా ప‌ట్టొచ్చ‌ని స‌మాచారం. షూటింగ్ ఏడాది ఆఖ‌రుకు పూర్త‌యిపోతుంది కానీ.. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌కు మాత్రం చాలా టైం ప‌డుతుంది. వ‌చ్చే ఏడాది ద్వితీయార్ధంలో ఈ సినిమా ప్రేక్ష‌కుల ముందుకొచ్చే అవ‌కాశ‌ముంది. లైకా ప్రొడ‌క్ష‌న్స్ సంస్థ దాదాపు రూ.350 కోట్ల‌తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న‌ట్లు అంచనా

No comments:

Post a Comment

About

Flickr