Nestham Movie Creations

Tuesday, 15 November 2016

చైతూ-సమంత పెళ్లి.. కొత్త కబురు


అక్కినేని కుర్రాళ్ల పెళ్లిళ్ల గురించి రోజుకో కొత్త అప్ డేట్ వస్తోంది. నాగార్జున చిన్నకొడుకు అఖిల్ పెళ్లి విషయంలో దాదాపుగా ఒక క్లారిటీ వచ్చేసింది. డిసెంబరు 9న నిశ్చితార్థం హైదరాబాద్ లో చేసేసి.. వచ్చే ఏడాది వేసవిలో రోమ్ వేదికగా డెస్టినేషన్ వెడ్డింగ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటోంది అక్కినేని ఫ్యామిలీ. నిశ్చితార్థం కోసం అతిథుల్ని పిలిచే పనిలో బిజీగా ఉన్నాడు నాగ్. ఇక నాగచైతన్య-సమంత పెళ్లి గురించే ఇంకొంచెం క్లారిటీ రావాల్సి ఉంది. ఆశ్చర్యకరంగా తమ్ముడి పెళ్లి ముందు కానిచ్చేసి.. ఆ తర్వాత తాను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు చైతూ. అఖిల్ పెళ్లి సంగతి తేలిపోవడంతో తన పెళ్లికి కూడా ముహూర్తం చూసుకున్నాడట చైతూ. సమంతతో అతడి పెళ్లి వచ్చే ఏడాది ఆగస్టులో జరుగుతుందని సమాచారం. హిందూ.. క్రిస్టియన్ సంప్రదాయాల్లో రెండుసార్లు పెళ్లి చేసుకోవాలి కాబట్టి.. రెండు డేట్లు కూడా ఫైనలైజ్ చేశారట. రెంటికీ గ్యాప్ ఏమీ ఉండదు. వరుసగా రెండు రోజుల్లో ఈ తంతు ముగిస్తారు. ముందు చైతూ ఫ్యామిలీకీ ప్రయారిటీ ఇవ్వనున్నారు. మొదట హిందూ సంప్రదాయంలో పెళ్లి కానిచ్చి.. మరుసటి రోజు చెన్నైలోని ఒక చర్చిలో క్రిస్టియన్ సంప్రదాయంలో వివాహం జరిపిస్తారట. త్వరలోనే చైతూ-సమంతల పెళ్లి గురించి ఫుల్ క్లారిటీ ఇచ్చేస్తారట. చైతూ-సమంత దాదాపు మూడేళ్ల నుంచి ప్రేమలో ఉన్నారు

No comments:

Post a Comment

About

Flickr