
అందాల తార నయన తార తన బర్త్ డే కానుకగా అభిమానులకు సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది. ప్రస్తుతం 55వ సినిమా చేస్తున్న నయనతార తన పుట్టిన రోజు శుభాకాంక్షలతో అరం సినిమా ఫస్ట్ లుక్ ని విడుదల చేసింది. ఇందులో నయన లుక్ చాలా సీరియస్ గా ఉంది. ప్రస్తుతం సౌత్ ఇండస్ట్రీలో టాప్ హీరోయిన్ గా ఉన్న నయనతార కి అభిమానుల నుండే కాక పలువురి సెలబ్రిటీల నుండి ప్రత్యేక విషెస్ అందుతున్నాయి. నయన బాయ్ ఫ్రెండ్ విఘ్నేష్ కూడా తన ప్రేయసికి ప్రత్యేక శుభాకాంక్షలు అందించాడు. బాబు బంగారం, ఇంకొక్కడు, కాష్మోరా సినిమాలతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన నయన ఆ పాత్రలతో మెప్పించింది. కేవలం గ్లామర్ పాత్రలలోనే పౌరాణికం,సాంస్కృతిక పాత్రలలోను నటించి తెలుగింటి సీతమ్మగా మంచి పేరు తెచ్చుకుంది. ప్రస్తుతం నయనకున్న క్రేజ్ మరే హీరోయిన్ కి లేదంటే అతిశయోక్తి కాదు. మూడు పదుల వయస్సులోను ఈ హీరోయిన్ ఇప్పటికి సీనియర్ హీరోలతో పాటు కుర్రాళ్ళతోను జతకడుతుందంటే నయనకు యూత్ లో ఉన్న క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నయన ఇండస్ట్రీలోకి వచ్చి దాదాపు పది సంవత్సరాలు పూర్తి కాగా ఈ అమ్మడు ఇప్పటి వరకు 54 సినిమాలలో నటించింది. ప్రస్తుతం నయనకున్న క్రేజ్ ని బట్టి చూస్తుంటే రానున్న రోజుల్లో వంద సినిమాలు చేయడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తోంది. అందం, అభినయం ఉన్న నయనతార ఇలాంటి బర్త్ డేలు ఎన్నో జరుపుకోవాలని, మంచి సినిమాలతో ప్రేక్షకులని అలరించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
No comments:
Post a Comment