Nestham Movie Creations

Sunday, 13 November 2016

ఒకే సినిమాలో అనుష్క ముగ్గురితో రొమాన్స్..!-Anushka Romance With Three Heroes In Her Next Movie


Image result for anushka photos latestస్వీటీ అనుష్క వరుస సినిమాలతో బిజీగా ఉంది. ఓ పక్క భాగమతి షూటింగ్ చేస్తూనే మరో పక్క బాహుబలి ముగింపు కార్యక్రమాలను చూస్తున్న అనుష్క రీసెంట్ గా సింగం-3 ను కంప్లీట్ చేసుకుంది. ఇక కమిట్ అయిన సినిమాల్లో తమిళ దర్శకుడి బాలా సినిమా ఒకటి. ఆ సినిమాలో ఏకంగా ముగ్గురు హీరోలతో అనుష్క రొమాన్స్ చేసేందుకు సిద్ధమైంది. శివ్పుత్రుడు, నేను దేవుణ్ణి, వాడు వీడు సినిమాలతో మంచి క్రేజ్ సంపాదించిన బాలా దర్శకత్వంలో రాబోతున్న ఈ సినిమాలో ఆర్య, రానా, విశాల్ హీరోలుగా సెలెక్ట్ అయ్యారు. ఇక ఇప్పటికే ఆర్యతో మూడు సార్లు, రానాతో రెండు సార్లు కలిసి నటించిన అనుష్క విశాల్ తో మొదటిసారి జోడి కడుతుంది. సహజత్వంతో కూడిన బాలా సినిమాల్లో ప్రేక్షకులను భలే ఎంటర్టైన్ చేస్తాయి. అయన తీసిన సినిమాలు తెలుగులో కూడా మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇక సినిమాలో ఒక హీరోతో రొమాన్స్ అంటేనే రెచ్చిపోయే అనుష్క ఒకే సినిమాలో ముగ్గురితో అంటే ఎలా ఉండబోతుందో అని ఆడియెన్స్ ఎగ్సైటింగ్ గా ఉన్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబదించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందట. త్వరలోనే సినిమాకు సంబందించిన పూర్తి వివరాలు అఫిషియల్ ఎనౌన్స్ మెంట్ వచ్చే అవకాశాలున్నాయి

No comments:

Post a Comment

About

Flickr