Nestham Movie Creations

Sunday, 13 November 2016

‘అనసూయ.. అనసూయ’ అంటున్నారని.. ఐటెం సాంగ్‌కు ఓకే అందట!


బుల్లితెర హాట్‌ యాంకర్‌ అనసూయ ఇప్పుడు వెండితెర మీదా తన సత్తా చాటడానికి సిద్ధమైపోతోంది. ఇదివరకు ‘క్షణం’ సినిమాలో తన యాక్టింగ్‌ ట్యాలెంట్‌ను బయటపెట్టిన అనసూయ.. ఇప్పుడు సాయిధరమ్‌ తేజ్‌ ‘విన్నర్‌’ చిత్రం ద్వారా తన గ్లామర్‌ను చూపెట్టనుందట. ఇదివరకు ఓ టాప్‌హీరో సినిమాలో ఐటెం సాంగ్‌ చేయడానికి నిరాకరించిన అనసూయ.. ఇప్పుడు తేజు సినిమాలో అలాంటి పాటకే నర్తిస్తోంది. దీనికి ఓ ఆసక్తికరనమైన కారణం ఉందట. ఆ పాట ‘అనసూయ.. అనసూయ’ అంటూ ప్రారంభమవుతుందట. తన పేరు మీదే పాట ఉండడంతో అందులో నర్తించేందుకు అంగీకరించిందట ఈ హాట్‌ భామ. ఆ పాట షూటింగ్‌ కోసం అనసూయ ఉక్రెయిన్‌ వెళ్లింది. ఈ పాటలో అనసూయ చాలా గ్లామరస్‌గా కనబడుతుందని, ఈ సాంగ్‌ సినిమాకే హైలెట్‌ అవుతుందని చిత్ర యూనిట్‌ నమ్మకంగ ఉంది.

No comments:

Post a Comment

About

Flickr