Nestham Movie Creations

Sunday, 13 November 2016

సంక్రాంతికి ఆ సినిమా వస్తుందా రాదా

సంక్రాంతికి ఆ సినిమా వస్తుందా రాదా?
సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి 'ఖైదీ నెంబర్ 150'.. నందమూరి బాలకృష్ణ 'గౌతమీపుత్ర శాతకర్ణి' రిలీజ్ పక్కా అంటే పక్కా. అందుకోసం అన్ని ఏర్పాట్లూ జరిగిపోతున్నాయి. మరోవైపు దిల్ రాజు కూడా తన 'శతమానం భవతి'ని సంక్రాంతికే విడుదల చేసి తీరాలని పట్టుదలతో ఉన్నాడు. ఈ మూడు సినిమాలూ పండగ కోసం ముందు నుంచి ప్లానింగ్‌లో ఉన్నాయి. ఐతే వీటితో పాటు విక్టరీ వెంకటేష్ మూవీ 'గురు' కూడా సంక్రాంతికి వస్తుందన్న ప్రచారం కొంత కాలంగా నడుస్తోంది. మామూలుగా అయితే సంక్రాంతికి ఉన్న పోటీ ప్రకారం చూస్తే 'గురు'ను రేసులోకి దించాల్సిన అవసరం లేదు. కానీ సినిమా సంక్రాంతి కంటే ముందే రెడీ అయిపోయేలా ఉండటంతో పండగ సెలవుల్ని సద్వినియోగం చేసుకోవడం గురించి ఆలోచిస్తోందట చిత్ర బృందం. ఈ ఏడాది సంక్రాంతికి నాలుగు సినిమాలు పోటీ పడి.. నాలుగూ మంచి కలెక్షన్లే రాబట్టాయి. శర్వానంద్ లాంటి చిన్న హీరో సినిమా 'ఎక్స్‌ప్రెస్ రాజా' కూడా పెట్టుబడి మీద రెట్టింపు వసూళ్లు రాబట్టింది. 'గురు' విషయానికి వస్తే అది తమిళ రీమేక్. వెంకీకి బాగా సూటయ్యే సబ్జెక్ట్. పైగా తక్కువ బడ్జెట్లో లాగించేస్తున్నారు. వెంకీ సినిమా అంటే ఆయనకంటూ ప్రేక్షక వర్గం ఉంది కాబట్టి వసూళ్లకు ఢోకా ఉండదు. పైగా ఈసారి కూడా శర్వానంద్ లాంటి చిన్న హీరో సినిమానే రేసులో నిలబెడుతున్నారు. అలాంటపుడు మనకేమైంది అన్న ప్రశ్న తలెత్తుతోంది. దీని నిర్మాత సురేష్ బాబు కాబట్టి థియేటర్ల సమస్య కూడా ఉండదని సంక్రాంతి రిలీజ్ గురించి కొంచెం సీరియస్‌గానే ఆలోచిస్తున్నారట. ఒకవేళ సంక్రాంతి రిలీజ్ వద్దనుకుంటే జనవరి 26న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు

No comments:

Post a Comment

About

Flickr