Nestham Movie Creations

Sunday, 6 November 2016

ముద్దులు పెట్టీపెట్టీ అలసిపోయాను.. ఇక ముద్దు సీన్లలో నటించను: రణ్‌వీర్ సింగ్

ranveer singh - vani kapoor
 ఓ బాలీవుడ్ హీరో ముద్దులు పెట్టీపెట్టీ అలసిపోయాడట. ముద్దులు పెట్టి తెగ కష్టపడిపోయాడట. అందుకే ఇకపై ముద్దు సీన్లలో నటించనని తెగేసి చెపుతున్నాడు. ఎందుకంటే ముద్దు సీన్లలో నటించి నటించి విసుగొచ్చేసిందట. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ బ్యా
నర్‌పై ఆదిత్య చోప్రా రూపొందిస్తున్న 'బేఫికర్' సినిమా మనోడికి ముద్దంటే చేదే అనే నిజాన్ని తెలియపరిచిందట. ఆ సినిమా హీరోయిన్‌ వాణీకపూర్‌ పెదాలను రణ్‌వీర్‌ లెక్కలేనన్ని సార్లు ముద్దాడాడట. 'సెట్‌లోకి అడుగుపెట్టింది మొదలు.. ముందు పై పెదవిని ముద్దాడాలి.. ఆతర్వాత కింద పెదవి.. ఆపై సుదీర్ఘంగా చుంబించుకోవాలి.. ఒక్క యాంగిల్లో కాదు.. రకరకాల యాంగిల్స్‌లో.. నిజంగా ముద్దులు పెట్టీ పెట్టీ చాలా అలసిపోయాను. ఇక, ఇప్పట్లో ముద్దు సీన్లు ఉండే సినిమాలను అంగీకరించన'ని తేల్చిచెప్పేస్తున్నాడు రణ్‌వీర్‌. ఈ సినిమలో రికార్డు స్థాయిలో ముద్దు సీన్లు ఉంటాయని తెలుస్తోంది. డిసెంబర్‌ 9న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది

No comments:

Post a Comment

About

Flickr