Nestham Movie Creations

Sunday, 13 November 2016

పవన్ కళ్యాణ్ సెట్లో ఎవరికి గౌరవం ఇవ్వరు అంటున్న హీరోయిన్-Young Actress’s Controversial Comments On Pawan Kalyan


Image result for pawan kalyan photosఓ యువ నటి ఎలా ఉంటుంది. పైకెదగాలి కాబట్టి కళ్ళముందు ఏం జరుగుతున్నా కనిపించనట్టుగానే వెళ్ళిపోవాలి. మనదాకా వస్తే తప్ప దేనిపైన పెదవి విప్పకూడదు. ఆఫ్ ది రికార్టు కూడా నోరు జారకూడదు. కాని ఓ యువనటి టంగ్ స్లిప్ అయిపోయి పవర్ స్టార్ మీద సంచలన కామెంట్స్ చేసేసిందట. “పవన్ కళ్యాణ్ సెట్లో ఎవరికి గౌరవం ఇవ్వరు. అది టెక్నిషియన్స్ అయినా సరే, నటులైనా సరే. సినిమాని హిట్ చేయడానికి ఆయనొక్కరు ఉంటే సరిపోతుంది అనే భావనలో ఉంటారు. ఎవరికి గౌరవం ఇవ్వకుండా తనని తాను ఒక సూపర్ స్టార్ అని పిలుచుకుంటారు. సర్దార్ గబ్బర్ సింగ్ అందుకే ఫ్లాప్ అయ్యింది. ఆయన తదుపరి సినిమా (కాటమరాయుడు) కూడా అదే పద్ధతిలో వెళుతోంది. సినిమా సెట్లోకి సరిగా వెళ్ళకముందే సినిమాటోగ్రాఫర్ మారిపోయాడు. ఎలాంటి బలమైన కారణం లేకుంటా షూటింగ్ క్యాన్సల్ అయిపోతూ ఉంటుంది. అయన్ని నమ్ముకోని కోట్లు పెట్టే నిర్మాతలు డిప్రెషన్ లోకి వెళ్ళిపోతుంటారు.” అంటూ ఓ యువనటి ఒక ఇటివలే ఓ వీక్లీ మ్యాగజీన్ కి ఇంటర్వ్యూ ఇస్తున్న సమయంలో వాఖ్యానించిందట. ఈ యువనటి ఎవరు అనేది బయటకి రావడం లేదు కాని, ఈ వ్యాఖ్యలు మాత్రం ఫిలింనగర్ లో చర్చనీయాంశంగా మారిపోయాయి. పవన్ కళ్యాణ్ గురించి ఇంతలా మాట్లాడుతోందంటే ఖచ్చితంగా ఆయనతో కలిసి పనిచేసిన నటి అయ్యుంటుంది. సర్దార్ గబ్బర్ లో కనిపించిన యంగ్ అమ్మాయిలు ఎవరో ఆలోచించి చూడండి

No comments:

Post a Comment

About

Flickr