
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానగణం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పవన్ జపం చేసే యంగ్ హీరోలు చాలా మందే ఉన్నారు. వారి సినిమాల్లోనూ పవర్ ప్రస్తావన వచ్చేలా ప్లాన్ చేసుకుంటుంటారు. నిఖిల్ తాజా చిత్రం 'ఎక్కడికిపోతావు చిన్నవాడా'.
ఈ చిత్రం ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది.
ఈ చిత్రంలోనూ పవన్ ప్రస్తావన వచ్చిందట. 'దెయ్యాలు కూడా పవన్ ఫ్యాన్సేనా ?' అనే డైలాగ్ బాగా పేలిందట. ఆ డైలాగ్ ఎవరు చెప్పారు.. ? ఏ సందర్బంలో వచ్చిందన్నది మాత్రం సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. ఇక, ఇప్పటికే ఫస్ట్ షో పడిపోయిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది.
ఈ చిత్రంలో ధ్రిల్లింగ్ ఎలిమెట్స్ బాగా పండాయట. ఫస్టాఫ్ లో వచ్చే డీసెంట్ బాగుండట. ఇక, సెకాండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ ఏపీసోడ్ సినిమాని నిలబెట్టాయని చెబుతున్నారు. అవికాగోర్.. ప్లాష్ బ్యాక్ లో దెయ్యంగా కనిపించి సడెన్ సర్ప్రైజ్ ఇచ్చిందట. బొర్రగుహల్లో వెతుకులాట ఈ చిత్రంలో హెలెట్ ఎపిసోడ్. అయితే, క్లైమాక్స్ కొంచెం వీక్ గా అనిపించిందని చెబుతున్నారు. మొత్తంగా చూస్తే.. నిఖిల్ 'ఎక్కడికిపోతావు చిన్నవాడా' ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ని సొంతం చేసుకొంది.
No comments:
Post a Comment