
తన బాయ్‌ఫ్రెండ్‌పై ఇలియానాకి ఎంత ప్రేమ అయినా వుండొచ్చు. కానీ దానిని ప్రపంచానికి చూపించాల్సిన పని లేదు. ఆస్ట్రేలియా ఫోటోగ్రాఫర్ ఆండ్రూ నీబోన్‌తో చాలా కాలంగా సహజీవనం చేస్తోన్న ఇలియానా మొదట్లో తమ వ్యవహారాన్ని తెర చాటునే వుంచేది. కానీ నెమ్మదిగా అతనితో కలిసి కాలం గడుపుతోన్న విషయం తెలియజెప్పేలా బెడ్‌రూమ్‌లో అతను తీసిన కొన్ని సెక్సీ ఫోటోలని ఇంటర్నెట్‌లో పెట్టడం మొదలు పెట్టింది. అతగాడు ప్రోత్సహిస్తూ వుండడంతో బికినీల్లో వీడియోలవీ పెడుతోన్న ఇలియానా ఇప్పుడు తాజాగా తన బీఎఫ్‌తో ముద్దు ముచ్చట్లు కూడా ఫోటోలు తీసి ఇంటర్నెట్‌లో పెట్టేస్తోంది. బాలీవుడ్‌లో అరకొర అవకాశాలే వస్తుండడంతో ఇలియానాకి చాలా ఖాళీ టైమ్ దొరుకుతోంది.
దీంతో తన బాయ్‌ఫ్రెండ్‌తో ఎక్కువ సమయం గడుపుతోన్న ఇలియానా తన పర్సనల్ డైరీని ఇలా పబ్లిక్‌లో పెట్టేస్తోంది. పెళ్లయిన జంటలు మినహా ఇలాంటివి పెట్టడానికి సెలబ్రిటీలు ఇష్టపడరు. ఎంత క్లోజ్ అయినా కానీ ఎవరైనా దొంగచాటుగా క్లిక్ చేసిన ఫోటోలే బయటకి రావాలి తప్ప ఈ విధంగా సెల్ఫ్ ప్రమోషన్లు ఇచ్చుకోరు. కానీ ఇలియానా మాత్రం తన రెబల్ నేచర్‌ని ప్రేమని వ్యక్తపరచడంలోను చూపిస్తూ, అమ్మాయిలకి కొత్త పాఠాలు చెబుతోంది.
No comments:
Post a Comment