
'దంగల్' మూవీ రెజ్లింగ్ వీరుడు మహవీర్ సింగ్ ఫోగట్- బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ ల మధ్య సాన్నిహిత్యం పెంచేసింది. ఎంతగా అంటే తాను మహవీర్ కుటుంబసభ్యుడిగా అమీర్ ఫీలైపోతున్నాడు. అందుకే మహవీర్ కుమార్తె గీతా ఫోగట్ వివాహానికి అంతా తానై వ్యవహరిస్తున్నాడు. అంతేకాక సంప్రదాయబద్ధంగా పెళ్లి కుమార్తెకు తండ్రి సమర్పించాల్సిన దుస్తులు కూడా అమీరే అందిస్తున్నాడు. ఆ వెడ్డింగ్ డ్రస్ లోనే రెజ్లర్ గీతా వివాహం చేసుకోనుంది.
ఈ నెల నవంబర్ 20న మహవీర్ స్వగ్రామం హర్యానా బలాలిలో జరిగే గీతా వివాహ వేడుకకు కావాల్సినవన్నీ అమీర్ ఖాన్ సమకూర్చుకుతున్నాడు. గీతకు పెళ్లిబట్టలతో పాటూ ఇతర బహుమతులనూ సిద్ధం చేశాడు. అంతేకాక ఆమె వివాహాన్ని దగ్గరుండి జరిపించాలని నిర్ణయించుకున్నాడు. మహవీర్ జీవితచరిత్ర ఆధారంగానే అమీర్ ప్రధాన పాత్రలో 'దంగల్' చిత్రం తెరకెక్కింది. ఈ క్రమంలో అమీర్ వారి కుటుంబానికి చాలా దగ్గరయ్యాడు. మహవీర్ కుమార్తెలతోనూ ఆయన అనుబంధం బలపడింది. అందుకే అమీర్ గీత పెళ్లి పట్ల ఇంత శ్రద్ధ చూపిస్తున్నాడు.
కుస్తీ క్రీడాకారుడైన మహవీర్ మగబిడ్డలు పుట్టకపోవడంతో ఆడపిల్లలనే ఈ రంగంలోకి తీసుకొచ్చి శిక్షణనిచ్చారు. ఆయన శిక్షణలోనే రాటుదేలిన గీత, బబితలు అంతర్జాతీయంగా పలు పతకాలు సాధించి భారత్ కు పేరు తెచ్చారు. 'దంగల్'లో మహవీర్ గా నటించిన అమీర్ ఈ పాత్ర కోసం 25కిలోల బరువు పెరిగి అందర్నీ ఆశ్చర్యంలో పడేశారు.
No comments:
Post a Comment