
సినిమా రంగంలో ఉంటూ వివాదాలకు.. గాసిప్స్ కు దూరంగా ఉండటం సాధ్యం కాదు. కానీ.. అందుకు భిన్నంగా కనిపిస్తారు మహేశ్ బాబు. ఎలాంటి వివాదాలకు అవకాశం ఇవ్వకుండా తన పని తాను చేసుకుంటూ పోయే ఆయనలో ఒక ప్రొఫెషన్ యాక్టర్ మాత్రమే కాదు.. ఒక పక్కా ఫ్యామిలీ పర్సన్ కనిపిస్తారు. స్టార్ హీరోగా ఉంటూ తన పిల్లలతో ఎక్కువ సమయాన్ని గడిపే అతి కొద్ది మంది హీరోల్లో మహేశ్ బాబు ఒకరుగా చెబుతుంటారు. అంతేకాదు.. తన సినిమా ఫంక్షన్లకు పిల్లల్ని తీసుకొచ్చి.. వారితో వీలైనంత టైం గడిపేందుకు ఆయన ఆసక్తి చూపిస్తుంటారు.
పిల్లల్ని అమితంగా ప్రేమించే మహేశ్.. బాలల దినోత్సవం సందర్భంగా తనదైన శైలిలో ఒక ట్వీట్ చేశారు. పిల్లలకు ఏం కావాలో ఆయన తన ట్వీట్ తో చెప్పేశారు. వారికి కావాల్సింది ప్రేమేనని.. అప్పుడే వారు మరింతగా ప్రేమిస్తారని.. స్వేచ్ఛగా విహరించటం చూడగలుగుతామని చెప్పుకొచ్చారు. ట్వీట్ తోసరి పుచ్చకుండా పిల్లలతో తాను దిగిన ఫోటోను పోస్ట్ చేసిన మహేశ్ ట్వీట్ పలువురి దృష్టిని ఆకర్షిస్తోంది.
No comments:
Post a Comment