
ఎప్పుడైతే ప్రధాని మోదీ 500 నోట్లు, 1000 నోట్లు కాన్సిల్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారో అప్పుటి నుంచి సినిమా పరిశ్రమలో నయా దందా షురు అయింది.నిన్నంతా ఓ హీరో దగ్గర బ్లాక్ మనీ బోల్డు మూలుగుతోంది, ఏం చేయాలో అర్దం కాక, నిరాశలో మునిగిపోయాడంటూ వార్తలు వచ్చి, ఎవరా హీరో అని ఎంక్వైరీ మొదలెట్టిన నేపధ్యంలో ఇప్పుడు మరో వార్త బయిటకు వచ్చింది. అది రీసెంట్ గా సినిమాలు తగ్గించుకున్న హీరోయిన్ ఒకరి దగ్గర మూడు కోట్లకు పైగానే బ్లాక్ ఉందిట. ఆమె ఫామ్ లో ఉన్నప్పుడు సంపాదించిన సొమ్ము అది. పెళ్లి చేసుకుని సెటిల్ అవుదాము...దాంతో ఓ ప్రాపర్టీ కొందాము అని నిర్ణయించుకున్న ఆమెకు మోదీ దెబ్బతో పూర్తి నిరాశ ఎదురైందని చెప్తున్నారు. దాంతో ఆమె కష్టపడి సంపాదించుకున్న సొమ్ము..మూడు కోట్లు అని వాపోతోందిట. అయితే మూడు కోట్లుని వైట్ చేసుకునేందుకు తమ సర్కిల్స్ లో ప్రయత్నిస్తోందని చెప్పుకుంటున్నారు.ఇలాంటి వారిని టార్గెట్ చేశారు బ్రోకర్స్.ఇలాంటివారినుంచి డబ్బు మొత్తం తీసుకుని 70 30 పర్సెన్‌టేజ్ లెక్కన తీసుకుంటున్నారు.
వాస్తవానికి మన తెలుగులో కాదు దేశంలోని అన్ని లాంగ్వేజ్ ల్లోనూ చాలా మంది హీరోలు, హీరోయిన్స్ బ్లాక్ ఇంత, వైట్ ఇంత అని రెమ్యునేషన్ ని తీసుకుంటూంటారు. నిర్మాతలకు అదే వెసులు బాటుకావటంతో బ్లాక్ మనీ విచ్చలవిడిగా పరిశ్రమలో తిరిగుతూంటుంది. ఆ డబ్బు అటు తిరిగి ఇటు తిరిగి మళ్లీ రియల్ ఎస్టేట్ రంగంలోకి అందులోంచి మళ్లీ సినీ పరిశ్రమలోకి వస్తుంది. దాంతో చాలా మంది హీరోలు, హీరోయిన్స్ వద్ద బ్లాక్ మనీ అనేది కామన్. కాకపోతే హీరోల వద్ద బ్లాక్ ఉండటానికి అవకాసం ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే హీరోలకి రెమ్యునేషన్ ఎక్కువ కాబట్టి. దానికి తోడు రెమ్యునేషన్స్ విపరీతంగా పెరగటంతో బ్లాక్ అనేది , టాక్స్ కట్టకుండా తప్పించుకోవటానికి ఓ మార్గం అయ్యింది. ఈ నేపధ్యంలో ప్రధాని తీసుకున్న ఈ నోట్ల కట్ల రద్దు వ్యవహారం ఇలాంటి వారందిరికీ సమస్య తెచ్చి పెట్టింది.
ప్రధాని మోదీ నోట్ల కట్ల రద్దు వ్యవహారం తెలుగులోని ఓ స్టార్ హీరో కు పెద్ద తలనొప్పే తెచ్చిపెట్టినట్లైంది. పాతిక కోట్లకు పైగా క్యాష్ ఆయన ద్గగర బ్లాక్ మనీ ..ఇప్పుడు ఏం చేయాలో అని తలపట్టుకున్నారట. నిన్నటి నుంచి షూటింగ్ కు కూడా హాజరు కాకుండా ఆయన తన వాళ్లతో మంతనాలు జరుపుతున్నారట.ఇలాంటి వారిని టార్గెట్ చేస్తూ..బ్రోకర్స్ క్యాష్ చేసుకుంటున్నారు.ప్రస్తుతం సినిమా ఇండస్ట్రీలో ఈ బిజినెస్ బాగా నడుస్తుంది.
No comments:
Post a Comment