Nestham Movie Creations

Saturday, 12 November 2016

బామ్మర్ది హీరోయిన్‌తో బావ..

బామ్మర్ది హీరోయిన్‌తో బావ..
ఒకే ఫ్యామిలీకి చెందిన వేర్వేరు హీరోలు.. ఒకే హీరోయిన్ తో తెరను పంచుకోవడానికి కొంత మొహమాట పడేవాళ్లు ఒకప్పుడు. ఇక్కడ వరసలు అడ్డొచ్చేవి. కానీ ఈ రోజుల్లో అవన్నీ చూసుకుంటే కష్టం. అసలే హీరోయిన్ల కొరత.. పైగా ఒకే ఫ్యామిలీ నుంచి బోలెడంత మంది హీరోలొచ్చేస్తున్నారు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ హీరోలు ఈ విషయంలో ఏమాత్రం పట్టింపులకు పోయినా ఇబ్బందే. అందుకే రామ్ చరణ్.. అల్లు అర్జున్ సరసన నటించిన కాజల్ అగర్వాల్ తో చిరు కూడా జత కట్టేస్తున్నాడు. మరోవైపు తనకు బావమదిరి వరసయ్యే వరుణ్ తేజ్ కు జోడీగా నటించిన ప్రగ్యా జైశ్వాల్ తో కలిసి సాయిధరమ్ సినిమా చేస్తున్నాడు. తేజు కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘నక్షత్రం’ 20 నిమిషాల నిడివి ఉండే గెస్ట్ రోల్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో అతను పోషిస్తున్నది పోలీస్ పాత్ర. దానికి జోడీగా ప్రగ్యా నటిస్తోంది. ఆమెది కూడా పోలీసు పాత్రే. ఈ సినిమాలో నటింబోతుండటం గొప్ప అనుభవమని.. కొన్నేళ్ల కిందట తాను నేర్చుకున్న కరాటె క్లాసులు ఇప్పుడు బాగా పనికొస్తున్నాయని చెప్పింది ప్రగ్యా. ‘‘కెరీర్ లో ఇంత త్వరగా పోలీసాఫీసర్ పాత్రలో నటించే అవకాశం వస్తుందని కలలో కూడా అనుకోలేదు. ముఖ్యంగా ఫైట్ సీక్వెన్స్ విషయంలో చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాను. ఐదేళ్ల పాటు కరాటేలో శిక్షణ పొంది బ్లాక్ బెల్ట్ సాధించాను. నేను నేర్చుకున్న ఆ విద్య ఇప్పుడిలా ఉపయోగపడుతుంది. షూటింగ్ త్వరగా మొదలవ్వాలని కోరుకుంటున్నాను. కృష్ణవంశీ గారి తో పనిచేయడమంటే కల నిజమవ్వడమే’’ అని చెప్పింది ప్రగ్యా

1 comment:

About

Flickr