Nestham Movie Creations

Thursday, 17 November 2016

నితిన్ కి సాయం చేస్తానంటున్న సమంత..!


ఇటీవలి కాలంలో కొందరు యంగ్ హీరో, హీరోయిన్స్ కేవలం సినిమాలకే పరిమితం కాకుండా బిజినెస్ పై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు. ఇప్పటికే రామ్ చరణ్, రకుల్, రెజీనా తదిదరులు వివిధ రంగాలలో బిజినెస్ చేస్తున్నారు. తాజాగా లవర్ బోయ్ నితిన్ టీ- గ్రిల్ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. ఈ రెస్టారెంట్ ని స్టార్ హీరోయిన్ సమంతతో ప్రారంభించాలని భావించాడు. అ..ఆ సినిమాలో ఈ ఇద్దరు కలిసి నటించగా, ఆ సాన్నిహిత్యంతోనే సమంతని ఆహ్వానించాడని, అందుకు సామ్ కూడా రెడీ అయిందనే టాక్ వినిపిస్తోంది. ఈ రెస్టారెంట్ బిజినెస్ లో టాప్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజ కోన, నితిన్ కి పార్ట్నర్ షిప్ గా ఉంటుందని తెలుస్తోంది. పలువురు ప్రముఖులు ఈ రెస్టారెంట్ ప్రారంభ కార్యక్రమానికి హాజరు కానున్నారు. నితిన్ సినిమాల విషయానికి వస్తే హను రాఘవపూడి దర్వకత్వంలో ఓ సినిమా, కృష్ణ చైతన్య దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నాడు.

No comments:

Post a Comment

About

Flickr