Nestham Movie Creations

Tuesday, 15 November 2016

నయన్ మళ్లీ బికినీ వేస్తోందా!?


సౌతిండియా టాప్ హీరోయిన్ నయనతార అనడంలో పెద్దగా అభ్యంతరాలు ఏవీ వ్యక్తం కావు. టాలీవుడ్ లో ఈ మధ్య అమ్మడికి క్రేజీ మూవీస్ పడలేదు కానీ.. కోలీవుడ్ మల్లూవుడ్ లలో బెస్ట్ యాక్ట్రెస్ అవార్డులు కూడా అందేసుకుంది. వరుస బ్లాక్ బస్టర్స్ తో దూసుకుపోతున్న ఈ బ్యూటీ.. త్వరలో పెళ్లి పీటలు ఎక్కేయనుందనే టాక్ కూడా ఉంది. డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ను పెళ్లాడినా సరే.. సినిమాల్లో కంటిన్యూ అయ్యే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయట. ఇలాంటి టైమ్ లో నయనతార బికినీ వేయనుందంటూ ఓ న్యూస్ హల్ చల్ చేస్తోంది. యంగ్ హీరో అథర్వ నటిస్తున్న 'ఇమైకా నోడిగల్' అనే చిత్రంలో నయన్ ఓ లీడ్ రోల్ చేస్తోంది. ఇందులో రాశిఖన్నా కూడా ఉండగా.. అథర్వకు జోడీగా చేసే రోల్ రాశిదే. నయన్ ది సెపరేట్ రోల్ అయినా.. సినిమా ఆమె చుట్టూనే ఉంటుందట. ఈ మూవీలో నయనతార బికినీ వేయనుందనే టాక్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. కెరీర్ మొదట్లో బిల్లా లాంటి మూవీస్ లో బికినీలో కనిపించిన నయనతార.. ఆ తర్వాత చిట్టి పొట్టి దుస్తుల్లో అడపాదడపా మెరుస్తూనే ఉంది కానీ.. బికినీ మాత్రం వేయలేదు. ఇప్పుడు కూడా మూవీకి హైప్ తీసుకొచ్చేందుకు క్రియేట్ చేసిన రూమర్ తప్ప.. ఇప్పుడు నయన్ ఉన్న పొజిషన్ కి బికినీ వేయాల్సిన అవసరం లేదన్నది కోలీవుడ్ టాక్.

No comments:

Post a Comment

About

Flickr