Nestham Movie Creations

Thursday, 17 November 2016

భారతదేశంపై చైనా చిత్రం..ఆస్కార్ కు పంపిన ప్రభుత్వం


china movie on indiam cinemaభారతదేశం ఒకప్పుడైనా, ఇప్పుడైనా ప్రపంచానికే తలమానికం. మన దేశ సంస్కృతీ సంప్రదాయాలు ఇతర దేశాలకు ఆదర్శం. ఒక మహోజ్వల చరిత్ర ఉన్న దేశం మనది. అందుకే మన దేశం గురించి, ఔన్నత్యం గురించీ మన దర్శకులు సినిమాలు తీశారు. విదేశీయులు కూడా తీశారు. తాజాగా చైనా వారు ఆస్కార్ అవార్డ్ కోసం పంపించిన ఒక సినిమా భారతదేశం గురించి తీసిందేనట. మన సత్యజిత్ రాయ్ తీసిన సినిమాలు ప్రపంచఖ్యాతి పొందాయి. అలాగే మన జాతిపిత మహాత్మాగాంధీపై విదేశీయులు గాంధీ సినిమా తీశారు. తాజాగా ఇలాంటిదే మరో సంఘటన జరిగింది. ఈ ఏడాది ఆస్కార్ రేసులో నిలిచిన చైనా సినిమా జాన్ జాంగ్ కథ భారతదేశం బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తుంది. గతంలో రెండుసార్లు ఆస్కార్ కోసం ట్రై చేసి భంగపడిన చైనా ఇప్పుడు జాన్ జాంగ్ సినిమాకైనా ఆస్కార్ లో ఆస్కారం ఉంటుందని ఆశిస్తోంది. మనదేశంపై వ్యతిరేకత ఉన్న చైనా భారత్ నేపథ్యంతో సినిమాతో ఆస్కార్ దక్కించుకోవాలని ప్రయత్నించడం ఆశ్చర్యమే. ఏడో శతాబ్దానికి చెందిన జాన్ జాంగ్ అనే బౌద్ధ సన్యాసి జీవితం ఆధారంగా ఈ సినిమాను తీశారు. జాన్ జాంగ్ చిత్రంలో హర్షవర్ధనుడుగా సోనూ సూద్ నటించగా నేహాశర్మ, మందనా కరిమి వంటి 15మంది భారతీయ నటీనటులు ఈ సినిమాలో నటించారు. మన దేశంలో అజంతా.. ఎల్లోరా.. నలంద సహా పలు ప్రాంతాల్లో షూటింగ్ చేశారు. జాన్ జాంగ్ కు ఆస్కార్ నామినేషన్ కోసం చైనా ప్రభుత్వం చొరవ తీసుకొంది. అప్పట్లో అమితాబ్ ను కూడా తీసుకుందామనుకున్నారు కానీ కుదరలేదు.

No comments:

Post a Comment

About

Flickr