Nestham Movie Creations

Thursday, 17 November 2016

బాహుబలికి నిఖిల్ గ్రాఫిక్ డిజైనరట!


నిఖిల్ ఈ మధ్య స్టైల్ మార్చేశాడు. కాస్త భిన్న పంథాలో సాగే చిత్రాల్లో నటిస్తున్నాడు. కథల ఎంపికలో కొంత వైవిధ్యం చూపిస్తున్నాడు. ఇప్పుడు మరో సరికొత్త కథనంతో సాగే ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ చిత్రంతో శుక్రవారం ముందుకు రాబోతున్నాడు. నోట్ల రద్దుతో జనాల వద్ద డబ్బు లేక ఇబ్బందులు పడుతున్నా.. చాలా కాన్ఫిడెంట్‌గా సినిమాను విడుదల చేసేస్తున్నారు. అయితే.. ఈ సినిమా గురించి తెలిసిన ఆసక్తికర విషయమేంటంటే ‘బాహుబలి-2’ సినిమా గ్రాఫిక్స్ ఈ యువ హీరో చేతుల్లోనే ఉన్నాయంట. అంటే.. బాహుబలి సినిమాకు గ్రాఫిక్ డిజైనర్‌గా పనిచేసే పాత్రలో నిఖిల్ కనిపిస్తాడట. ఈ విషయాన్ని నిఖిలే స్వయంగా వెల్లడించాడు. ‘‘నేను ఈ సినిమాలో బాహుబలికి గ్రాఫిక్ డిజైనర్‌గా కనిపిస్తాను. కానీ, రాజమౌళి మాత్రం ఈ సినిమాలో నటించట్లేదు. నేను ఆయనతో మాట్లాడేలా సన్నివేశాలు మాత్రమే ఉంటాయి’’ అని నిఖిల్ అన్నాడు. ‘‘వెన్నెల కిషోర్‌కు దెయ్యం పడుతుంది. తన ట్రీట్‌మెంట్ కోసం బొర్రాగుహల్లో ఉండే మహిషాసుర మర్దిని ఆలయానికి వెళతాం. అక్కడి నుంచి సినిమా చాలా ఆసక్తికరంగా సాగుతుంది. సన్నివేశాలు చాలా బాగుంటాయి’’ అని చెప్పాడు. అయితే.. ఒక్క విషయం గమనిస్తే మొన్నటి ‘మజ్ను’ సినిమాలో నాని బాహుబలి సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ పాత్రలో కనిపిస్తే.. తాజాగా నిఖిల్ కూడా తన సినిమాకు బాహుబలిని వాడేసుకున్నాడన్నమాట.

No comments:

Post a Comment

About

Flickr