Nestham Movie Creations

Wednesday, 16 November 2016

నితిన్‌ సంచలన ప్రకటన చేసేశాడు!


‘నేనో సంచలన ప్రకటన చేయబోతున్నాన’ని మంగళవారం రాత్రి నితిన్‌ ఓ ట్వీట్‌ చేశాడు. ఆ సందర్భంగానే ఆ ప్రకటన పెళ్లి గురించి కాదని కూడా చెప్పేశాడు. దీంతో ఆ ప్రకటన ఏంటని అందరూ ఆసక్తిగా చర్చించుకున్నారు. చెప్పినట్టుగానే నితిన్‌ ఓ సంచలన ప్రకటన చేశాడు. పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌లు నిర్మాతగా నితిన్‌ ఓ సినిమా చేయబోతున్నాడు. బుధవారం ఉదయమే ఈ సినిమా ప్రారంభోత్సవం జరిగింది. ‘రౌడీఫెలో’ సినిమా డైరెక్టర్‌, గీత రచయిత కృష్ణ చైతన్య ఈ సినిమాకు డైరెక్టర్‌. చైతన్య ఈ కథను మొదట త్రివిక్రమ్‌కు చెప్పాడు. ఆ కథ నచ్చి ఆ సినిమాను ప్రొడ్యూస్‌ చేస్తానని త్రివిక్రమ్‌ ఎప్పుడో చెప్పాడు. ఇప్పుడు అది ఇలా ఫైనలైజ్‌ అయిందన్నమాట. త్రివిక్రమ్‌, పవన్‌ కల్యాణ్‌తో పాటు నితిన్‌ సొంత బ్యానర్‌ శ్రేష్ట్‌ మూవీస్‌ కూడా నిర్మాణంలో పాలు పంచుకుంటోంది.

No comments:

Post a Comment

About

Flickr