Nestham Movie Creations

Tuesday, 15 November 2016

చెమటలు పట్టిస్తున్నావా రాశి ఖన్నా


విపరీతంగా వర్కవుట్స్ చేస్తే ఏమొస్తుంది? అని అడిగితే.. సహజంగా అయితే 'నొప్పులొస్తాయ్'.. 'చెమటొస్తుంది..' అంటూ డైలాగ్స్ పడుతూ ఉంటాయ్. కానీ ఇదే విషయాన్ని హీరోయిన్స్ ని అడిగితే మాత్రం వాళ్ల ఆన్సర్ డిఫరెంట్ గా ఉంటుంది. వాళ్లూ వీళ్లు అడగడం ఎందుకులే అనుకున్న టాలీవుడ్ బ్యూటీ రాశీ ఖన్నా.. తనే ఆన్సర్ లాంటి స్టేట్మెంట్ ఇచ్చేసింది. ఫుల్లుగా వర్కవుట్స్ చేసిన వెంటనే.. ఓ సెల్ఫీ తీసుకుని ఇన్ స్టాగ్రామ్ లో పెట్టేసింది రాశి ఖన్నా. పింక్ కలర్ టాప్ లో ఒంట్లోని ప్రతీ అంగుళం చెమటలు పట్టేసిన పరిస్థితిని చూపిస్తోందన్న మాట. మొహం.. భుజాలు.. మెడ ఇలా మొత్తం చెమటలతో తడిసిపోయాయన్న మాట. 'వర్కవుట్ చేస్తున్నా.. దీని సైడ్ ఎఫెక్ట్స్ లో చెమట.. ఆనందం.. ఓ అద్భుతమైన ఫీలింగ్ కూడా ఉంటాయ్' అంటోంది రాశి. అమ్మడికి చెమటలు పట్టడం సంగతేమో కానీ.. ఇలాంటి ఒరిజినల్ లుక్ లు చూపిస్తే.. చూసినోళ్లకి చెమటలు పట్టేయడం ఖాయం. రాశి ఖన్నా చెప్పిన సైడ్ ఎఫెక్ట్స్ అప్పుడు వాళ్లకు కూడా పాకేస్తాయేమో కదా

No comments:

Post a Comment

About

Flickr