
సినిమా హిట్ కోసం ఏ ఇండస్ట్రీకి వెళ్లినా పరాభవమే ఎదురైంది. అయినా తన ప్రయత్నాలు మాత్రం ఆపకుండా ఆఖరికి హిట్ కొట్టింది త్రిష. వరుస ప్లాపులతో బాధపడుతున్న సమయంలో త్రిషకు ‘ధర్మయోగి’ రూపంలో ఓ హిట్ వచ్చిపడింది. అంతేకాదు అందులో తన నటనకు విమర్శకుల ప్రశంశలు సైతం అందుకుంది. ఈ సినిమా సక్సెస్‌తో మళ్లీ ఫామ్‌లోకొచ్చిన త్రిష.. ప్రస్తుతం ‘మోహిని’ అనే హర్రర్ చిత్రంలో టైటిల్ రోల్ చేస్తుంది. దానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను చిత్ర బృందం ఇటీవల విడుదల చేసింది. దీనికి భారీ స్పందనే వచ్చింది. కానీ ఆ ఫస్ట్ లుక్ విషయంలో కొన్ని మీడియా సంస్థలు చేసిన పనికి త్రిషకు చిర్రెత్తుకొచ్చిందట.
అదేమిటంటే.. ఈ ఫస్ట్ లుక్‌పై కొన్ని మీడియా సంస్థలు డబుల్ మీనింగ్ వచ్చేలా శీర్షికలు పెట్టాయట. అదెలాగంటే ‘త్రిష బ్లూ ఫిల్మ్‌కి భారీ రెస్పాన్స్ వస్తోంది’ అని రాశాయట. ఇది చూసిన త్రిష షాక్‌కు గురయిందట. పోస్టర్ మీద బ్లూ కలర్ షేడ్స్ ఉన్నంత మాత్రాన అది బ్లూ ఫిల్మ్ అయిపోతుందా?, అయినా డబుల్ మీనింగ్ వచ్చేలా అలా ఎలా రాస్తారని సదరు మీడియా సంస్థలపై సన్నిహితుల దగ్గర ఆక్రోషాన్ని వెల్లగక్కిందట. అయితే తన సినిమాకు ఇలాగైనా ఫ్రీ పబ్లిసిటీ వస్తుందనుకుందేమో ఇప్పటి వరకు త్రిష ఈ విషయంపై బహిరంగంగా ఎటువంటి ప్రకటనా చేయలేదు.
No comments:
Post a Comment