Nestham Movie Creations

Tuesday, 15 November 2016

కమెడియన్ తో మిల్కీ?? అబ్బే లేదంట


టివిల్లో స్టార్ కమెడియన్ ఎవరంటే.. ఇండియా అంతా తెలిసిన ఒకటే ఒక పేరు.. కపిల్ శర్మ. ఇతగాడు ఆ మధ్యన 'కిస్ కిస్కో ప్యార్ కరూ?' అనే సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చేశాడు. ఆ తరువాత ఇప్పుడు రెండు సినిమాలు లైన్లో ఉన్నాయ్. అయితే తన రాబోయే సినిమా గురించి ఒక ప్రొడక్షన కంపెనీ నిన్నే ఓ ప్రకటన చేసింది. కపిల్ శర్మ తదుపరి సినిమా 'ఫిరంగ్' చిత్రంలో మిల్కీ బ్యూటి తమన్నా అండ్ మోడల్ ఇషితా దత్తా హీరోయిన్లుగా నటిస్తున్నారనే న్యూస్ బయటకు వచ్చేసింది. దీనితో వెంటనే స్టన్ అయిన తమన్నా.. ఇందులో నిజంలేదని తమన్నా ట్విట్టర్ సాక్షిగా తేల్చి చెప్పింది. ''అది నిజం కాదు! నేను ఓ చిత్రంలో నటించడానికి సంతకం చేస్తే.. దాని గురించి మాట్లాడుతాను. దయచేసి రూమర్లను ప్రోత్సహించకండి'' అంటూ ట్వీటేసింది మిల్కీ. నిజానికి ఆ మధ్యన ఇలాగే ఒక మలయాళ సినిమాలో హీరో సిద్దార్ధ్ పక్కనే హీరోయిన్ గా తమన్నా చేస్తోంది అంటూ న్యూస్ వచ్చినప్పుడు కూడా తమన్నా ఇలాగే ఖండించింది. ఇకపోతే అమ్మడు ఇప్పుడు తమిళంలో ధర్మదురై తెలుగులో అభినేత్రి వంటి సినిమాలు ఫ్లాపులు కావడంతో.. విశాల్ సరసన చేసిన 'ఒక్కడొచ్చాడు' సినిమా హిట్టయితే బావుండునని చూస్తోంది. అది సంగతి

No comments:

Post a Comment

About

Flickr