Nestham Movie Creations

Sunday, 13 November 2016

సాహసం.. పడిందిగా పంచ్

సాహసం.. పడిందిగా పంచ్
'ఏమాయ చేసావె' లాంటి క్లాసిక్ తర్వాత గౌతమ్ మీనన్-నాగచైతన్య కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా 'సాహసం శ్వాసగా సాగిపో'. దీనిపై మంచి అంచనాలున్నాయి. అసలు పోటీయే లేకుండా సోలోగా రిలీజైందీ సినిమా. గత వారం వచ్చిని సినిమాల అడ్రస్ గల్లంతయిపోయింది. పైగా చైతూ లాస్ట్ మూవీ 'ప్రేమమ్' హిట్టవడం కూడా కలిసొచ్చే అంశమే. కానీ ఇన్ని సానుకూలతలున్నా సరే.. 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాకు ఆశించిన స్థాయిలో ఓపెనింగ్స్ లేవు. ఇంకా తొలి రోజు కలెక్షన్ల వివరాలు పూర్తిగా బయటికి రాలేదు కానీ.. ఈ సినిమాకు ఓపెనింగ్స్ అయితే ఏమాత్రం ఆశాజనకంగా లేవని సమాచారం. మామూలుగా అయితే 'సాహసం శ్వాసగా సాగిపో'కు తొలి రోజు హౌస్ ఫుల్స్ పడాలి. కానీ మార్నింగ్ షోకే చాలా చోట్ల థియేటర్లు ఖాళీగా కనిపించాయి. సగం కూడా నిండని హాళ్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా ఉన్నాయి. ఇందుకు ప్రధాన కారణం 500.. 1000 నోట్ల రద్దు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. రెగ్యులర్‌గా సినిమాలు చూసే జనాల దగ్గర వంద నోట్లు చాలినన్ని అందుబాటులో లేకపోవడంతో థియేటర్లకు వచ్చే పరిస్థితి లేదు. పెద్ద సిటీల్లో అయినా ఆన్ లైన్ కార్డ్ బుకింగ్ ద్వారా జనాలు బాగానే సినిమా చూశారు కానీ.. చిన్న నగరాలు, పట్టణాల్లో మాత్రం జనాలు తమదగ్గరున్న చిల్లరతో సినిమాలు చూడ్డానికి ఇష్టపడలేదు. దీంతో ఓపెనింగ్స్‌పై బాగా ప్రభావం పడింది. టాక్ బాగానే ఉన్నా.. రెండో రోజుకు కలెక్షన్లు ఇంకా తగ్గినట్లు తెలుస్తోంది. మొత్తానికి రిస్క్ చేసి ఈ వీకెండ్లోనే సినిమాను రిలీజ్ చేసేసిన నిర్మాతకు కలెక్షన్లు తీవ్ర నిరాశకు గురి చేస్తున్నాయి. వచ్చే వారం రెండు మూడు క్రేజీ సినిమాలు థియేటర్లలోకి వస్తున్న నేపథ్యంలో 'సాహసం శ్వాసగా సాగిపో' ఈ వారమే సాధ్యమైనంత ఎక్కువ కలెక్షన్లు రాబట్టుకోవాలి. కానీ పరిస్థితి చాలా కఠినంగా కనిపిస్తోంది. మరి ఈ సినిమా ఎలా బయటపడుతుందో చూడాలి

No comments:

Post a Comment

About

Flickr