Nestham Movie Creations

Sunday, 13 November 2016

మహేష్ సినిమాలో నయనతార సర్ ప్రైజ్..! -Nayanatara Surprise Role In Mahesh Movie


Image result for mahesh and nayanathara photosసూపర్ స్టార్ మహేష్ మురుగదాస్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతుంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా అప్డేట్ గురించి ఏ న్యూస్ బయటకు వచ్చినా అదో హాట్ న్యూస్ గా మారుతుంది. ఇప్పటికే మహేష్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ గా ఇదవరకు కన్నా డిఫరెంట్ లుక్ తో కనిపిస్తాడని వార్తలు రావడంతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అయితే ఇప్పుడు సినిమాలో కోలీవుడ్ లక్కీ బ్యూటీ నయనతార కూడా నటిస్తుందని టాక్. సినిమాలో ఓ ఇంపార్టెంట్ రోల్ రాసుకున్న మురుగదాస్ ఆ క్యారక్టర్ కు ముందు మహేష్ భార్య నమ్రతను అనుకున్నారట. నమ్రత నో చెప్పగా ఆ పాత్రలో నయనతారను ఓకే చేశారట. గజిని సినిమాలో ప్రత్యేక పాత్రలో ఛాన్స్ ఇచ్చి నయనతార కెరియర్ ను హిట్ ట్రాక్ ఎక్కించిన మురుగదాస్ ఈ సినిమా గురించి అడుగగానే పాజిటివ్ గా స్పందించిందట. మహేష్ నయనతార ఇదవరకు చూడని కాంబినేషన్.. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా చేస్తున్న ఈ సినిమాలో నయనతార నటించడం అదనపు ఆకర్షణగా చెప్పుకోవాలి. ఇప్పటికే భారీ సాంకేతిక నిపుణులతో పనిచేస్తున్న ఈ సినిమాలో ఇంకాస్త క్రేజ్ వచ్చేలా చేస్తున్న మురుగదాస్ చూస్తుంటే సినిమాను మరో గజిని రేంజ్ హిట్ కొట్టేందుకే స్కెచ్ వేసినట్టే అనిపిస్తుంది

No comments:

Post a Comment

About

Flickr