Nestham Movie Creations

Sunday, 13 November 2016

రోజా-నాగబాబు వెర్సస్ రమ్యకృష్ణ-పోసాని


తెలుగు టెలివిజన్ చరిత్రలోనే మోస్ట్ పాపులర్ ప్రోగ్సామ్స్ లో ‘జబర్దస్త్’ ఒకటని చెప్పుకోవాలి. గురు.. శుక్రవారాలు వచ్చాయంటే చాలు.. తెలుగు రాష్ట్రాల్లో లక్షల మందిని టీవీల ముందు కూర్చోబెట్టేస్తోంది ఈ కార్యక్రమం. బూతులెక్కువయ్యాయని.. డబుల్ మీనింగ్ డైలాగులు టూమచ్ అని.. ఎన్ని విమర్శలు వచ్చినా.. జనాల్ని ఈ కార్యక్రమం నవ్విస్తూ అద్భుతమైన ఆదరణతో దూసుకెళ్తోందన్నది మాత్రం వాస్తవం. టీవీలో వచ్చే ఒక కామెడీ కార్యక్రమానికి ఈ స్థాయిలో ఆదరణ ఉంటుందని ఎవ్వరూ ఊహించలేదు. కోట్ల రూపాయల ఆదాయం తెచ్చిపెడుతుండటంతో ఇదే తరహాలో ఈటీవీలో ఇంకా ఒకట్రెండు ప్రోగ్సామ్స్ మొదలయ్యాయి. ఐతే వేరే ఛానెళ్లేవీ ఇలాంటి ప్రోగ్రామ్స్ ట్రై చేయలేదు. ఐతే ఇప్పుడు మరో పెద్ద ఛానెల్ ‘జబర్దస్త్’ తరహాలోనే ఓ కార్యక్రమం మొదలుపెడుతున్నట్లు సమాచారం. టీవీల్లో ఇలా ఒక ప్రోగ్రాంను కాపీ కొట్టి ఇంకో ప్రోగ్రాం తయారు చేయడం.. అది కూడా పాపులర్ కావడం కొత్తేమీ కాదు. ‘జబర్దస్త్’ కార్యక్రమానికి జడ్జీలుగా వ్యవహరించే నాగబాబు.. రోజా కూడా ప్రత్యేక ఆకర్షణ. వాళ్లకు దీటుగా రమ్యకృష్ణ.. పోసాని కృష్ణమురళిలను ఈ కొత్త ప్రోగ్రాంకు జడ్జీలుగా ఎంపిక చేసుకున్నట్లు సమాచారం. వీళ్లిద్దరూ కచ్చితంగా జనాల్ని ఆకర్షిస్తారనడంలో సందేహం లేదు. ఆల్రెడీ కమెడియన్లతో కమిట్మెంట్లు తీసుకుని ఎపిసోడ్లు కూడా మొదలుపెట్టారట. త్వరలోనే ఈ ప్రోగ్రాం ప్రోమో రిలీజ్ చేయబోతోంది ఆ ఛానెల్.

No comments:

Post a Comment

About

Flickr