Nestham Movie Creations

Thursday, 17 November 2016

సానియా మీర్జా సిస్టర్ సంగీత్ లో సెలబ్రిటీస్


ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా చెల్లెలు అనమ్ మీర్జా సంగీత్ వేడుక నిన్న సాయంత్రం గ్రాండ్ గా జరిగింది. ఈ వేడుకకు ఇటు టాలీవుడ్, అటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. ముఖ్యంగా ఈ సంగీత్ వేడుకలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్, అందాల భామ పరిణితీ చోప్రా తమ స్టెప్పులతో అలరించారు. ఇక మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , తన భార్య ఉపాసనతో కలిసి ఈ సంగీత్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. సల్మాన్ తో కలిసి ఈ ఈవెంట్ లో రచ్చ చేశాడు మన చిరుత. ఎంతో సందడిగా జరిగిన ఈ సంగీత్ ఈవెంట్ లో కొందరు క్రికెటర్స్ కూడా హాజరైనట్టు చెబుతున్నారు. ఇటీవల సానియా తన చెల్లి పెళ్లి వేడుకకు తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ ని ఆహ్వనించిన సంగతి తెలిసిందే.

No comments:

Post a Comment

About

Flickr