Nestham Movie Creations

Sunday, 13 November 2016

వాళ్లిద్దరినీ చూస్తుంటే గిల్టీగా ఉంది: ఉపాసన


అపోలో లైఫ్‌తో పాటు పలు బాధ్యతలను సమర్థంగా నిర్వహిస్తున్న ఉపాసన.. భర్త రామ్‌చరణ్‌, హీరోయిన్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌లను చూసి ఓ విషయంలో గిల్టీగా ఫీలవుతోందట. రామ్‌చరణ్‌ ప్రస్తుతం ధృవ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఓ పాట షూటింగ్‌ కోసం చిత్ర యూనిట్‌తో కలిసి థాయ్‌లాండ్‌ వెళ్లాడు. భర్త చెర్రీతోపాటు ఉపాసన కూడా థాయ్‌లాండ్‌కు వెళ్లింది. తన భర్తతోపాటు నిర్విరామంగా రకుల్‌ కూడా కష్టపడుతుండడం చూసి ఉపాసన గిల్టీగా ఫీలైందట. అందుకే ‘నటుల పని ఎంతమాత్రమూ సులభం కాదు. డెస్క్‌ వెనకాల పనిచేయడానికే నా ప్రిఫరెన్స్‌. హార్డ్‌వర్కింగ్‌ హజ్బెండ్‌ చెర్రీ, రకుల్‌లకు నా రెస్పెక్ట్‌. వీకెండ్‌ ఆనందంగానే ఉన్నా వారి వర్క్‌ను చూస్తుంటే కాస్త గిల్టీగా ఉంది’ అని ట్వీటేసింది.

No comments:

Post a Comment

About

Flickr