Nestham Movie Creations

Tuesday, 15 November 2016

బంగారం' లాంటి ఐడియా.. ఇల్లు సర్దేశాడు


ఐదొందలు.. వెయ్యి నోట్ల రద్దు వ్యవహారం మహా రంజు సాగుతోంది. బ్లాక్ మనీ దాచుకున్నోళ్లంతా కిక్కురుమని అనలేకపోతున్నారు. ఇది టాలీవుడ్ లో చాలామందిపై గట్టి దెబ్బే వేసిందని కనిపిస్తూనే ఉంది. ఈ పరిస్థితినే ఫేస్ చేసిన ఓ తెలుగు హీరో.. బంగారం లాంటి ఐడియా వేశాడట. మోడీ నోట్ల రద్దు ప్రకటించే నాటికి ఈయన ఇంట్లో 5 కోట్ల రూపాయల క్యాష్ ఉందట. ఆ అమౌంట్ ను ఏం చేయాలనే విషయంపై ఒకట్రెండు రోజులు తీవ్రంగా ఆలోచించిన ఈయన.. తర్వాత తన పరిచయాలన్నీ ఉపయోగించి.. మొత్తాన్ని బంగారం బిస్కెట్లలోకి మార్చి పడేశాడట. ప్రస్తుతం బంగారం వ్యాపారులు ఈ పరిస్థితిని క్యాష్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న సంగతి చూస్తూనే ఉన్నాం. ఈ తెలుగు హీరో కూడా మార్కెట్ రేటుకు కొంత ఎక్కువ పెట్టి మరీ గోల్డ్ బిస్కెట్ల రూపంలోకి మొత్తం ఐదు కోట్లను మార్చేశాడట. ఆ తర్వాత తాపీగా వచ్చి మోడీ తీసుకున్న నిర్ణయం అదరహో అంటూ ప్రశంసలు కురిపించడం అసలు హైలైట్. ముందు ఇల్లు సర్దేసుకుని ఆ తర్వాత వచ్చి సమాజం గురించి మాట్లాడుతున్నాడంటూ పంచ్ డైలాగ్స్ ఈయన మీద పడుతున్నాయ్

No comments:

Post a Comment

About

Flickr