
చాన్నాళ్ల తర్వాత దర్శకుడు తేజ మనసు పెట్టి ఓ సినిమాని చేస్తున్నాడు. రానా హీరోగా తెలుగు, తమిళ భాషల్లో ఓ చిత్రాన్ని చేస్తున్నాడు తేజ. కాజల్ కథానాయిక. 'నేనే రాజు నేనే మంత్రి'ని ఫిక్స్ చేశారు. ఇటీవలే ఈ చిత్రం తొలి షెడ్యూల్ తమిళనాడులోని కారైకుడితో పాటు కేరళలో కూడా జరిగింది. తదుపరి షెడ్యూల్ హైదరబాద్ లో జరగనుంది.
ఈ చిత్రంలో కాజల్ తో పాటు మరో కథానాయికకు కూడా చోటుంది. ఆ స్థానం కోసం శృతిహాసన్ ని పరిశీలిస్తున్నారనే ప్రచారం జరిగింది. ఇప్పుడీ అవకాశం కేథరిన్ కి దక్కింది. రానా సినిమా కోసం కేథరిన్ ని ఫైలన్ చేశాడు తేజ. హైదరబాద్ లో జరగబోయే తదుపరి షెడ్యూల్ లో కేథరిన్ షూటింగ్ లో జాయిన్ కానుంది.
'సరైనోడు'తో కేథరిన్ తెరిస్సా కెరీర్ స్వీడందుకొంది. తెలుగు, తమిళ్ లోనూ సినిమాలు చేస్తూ బిజీ అయిపోయింది. ఆ మధ్య మెగా ఐటమ్ గా ఛాన్స్ కొట్టేసి.. ఆ తర్వాత జారవిడుచుకోవడంపై రకరకాల కామెంట్స్ వినిపించాయి. ఇక, టాలీవుడ్ లో కేథరిన్ కథ ముగిసినట్టేనని చెప్పుకొన్నారు. తాజాగా, తేజ సినిమా ఆఫర్ తో ఆ రూమర్స్ చెక్ పెట్టినట్టు కనబడుతోంది. ఇకపై కూడా ఈ ముద్దుగుమ్మ తెలుగు సినిమాలతో బిజీ అయిపోతుందేమో చూడాలి.
No comments:
Post a Comment