Nestham Movie Creations

Wednesday, 16 November 2016

వైఎస్ జగన్, హీరో సుమంత్ మధ్య అనుబంధం తెలిస్తే షాకవుతారు!


తెలుగు రాష్ట్రాల్లో చాలామందికి తెలియని విషయం ఏమిటంటే వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి, సినీ నటుడు సమంత్‌ చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ అని. వారిద్దరూ ఒకే క్లాస్‌లో, ఒకే బెంచ్‌లో కూర్చుని చదువుకున్నారట. చిన్న వయసులో వారిద్దరూ కలిసి చాలా అల్లరి చేసేవారట. బయట పొద్దుపోయేవరకు కలిసి తిరిగేవారట. ఓసారి ఆలస్యంగా ఇంటికి వచ్చి దొంగచాటుగా పైకి ఎక్కుతూ అక్కినేని నాగేశ్వరరావుకి దొరికిపోయారట. టాలీవుడ్ ప్రముఖ కమెడియన్ అలీ హోస్ట్‌గా చేసే ఓ కార్యక్రమంలో సుమంత్ ఈ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. ‘‘ఓరోజు రాత్రి బాగా ఆలస్యమైపోవడంతో జగన్‌ మా ఇంట్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. మేం ఇద్దరం దొంగచాటుగా నా బెడ్రూంలోకి వెళ్లేందుకు ప్లాన్‌ చేసుకున్నాం. కింద నుంచి పైనున్న నా బెడ్రూమ్‌కు వెళ్లడానికి నేను గ్రిల్‌ పట్టుకుని పైకి ఎక్కుతున్నా. జగన్‌ కింద ఉన్నాడు. ఆ సమయంలోనే మా తాత సడెన్‌గా బయటకు వచ్చారు. నాకు ఏం చేయాలో అర్థం కాలేదు. అప్పటివరకు జగన్‌ అంటే ఎవరో మా తాతకు తెలియదు. పై నుంచి గ్రిల్‌ పట్టుకుని వేలాడుతూనే మా తాతాకు జగన్‌ను పరిచయం చేశా. ‘తాతా అతని పేరు జగన్మోహన్‌రెడ్డి. వైఎస్‌ రాజశేఖర రెడ్డిగారి కొడుకు’ అని పరిచయం చేశాన’’ని చిన్నప్పటి సంగతులను సుమంత్‌ గుర్తు చేసుకున్నాడు.

No comments:

Post a Comment

About

Flickr