Nestham Movie Creations

Sunday, 13 November 2016

చనిపోయిన ప్రేయసి పాము రూపంలో మళ్ళీ పుట్టిందని పెళ్ళి చేసుకున్నాడు -Man Believes A 10 Feet COBRA As His Reincarnated Girlfriend And Marries


I Am Back Man Believes A 10 Feet Cobra As His Reincarnated Girlfriend And Marries 10ft Photo,Image,Pics-రాజమౌళి “ఈగ” సినిమా చూసారుగా. అందులో క్లయిమాక్స్ అయిపోయాక “I am Back” అంటూ మళ్ళీ వచ్చేస్తుంది ఈగ. మరి ఆ తరువాత ఈగ, సమంత ఎలా కలిసి ఉంటారు అని అప్పట్లో చాలామందికి వింత అనుమానాలు వచ్చాయి. మీ అనుమానానికి ఓ సమాధానం మాదగ్గర ఉంది. ఈ ఫోటోలలో చూస్తున్న అబ్బాయి ఊరు పేరు తెలియదు కాని, ఇతగాడు ఓ 10 అడుగుల పాముని పెళ్ళి చేసుకున్నాడు. ఇదేం పిచ్చి అని అనుకుంటున్నారా. ఇతని గర్ల్ ఫ్రెండ్ అయిదేళ్ళ క్రితం చనిపోయింది పాపం. ఏడ్చి ఏడ్చి అలసిపోయిన ఈ అబ్బాయికి అనుకోకుండా ఈ పాము దొరికింది. ఈ సర్పాన్ని చూడగానే చనిపోయిన తన ప్రేయసి ఈ జన్మలో పాముగా పుట్టింది అని అనిపించిందట. అలా ఎందుకు అనిపించిందో తనకే తెలియాలి కాని, దాన్ని ఇంటికి తెచ్చేసుకున్నాడు. ఆ పాముతోనే రోజంతా గడుపుతాడు. క్యారం ఆడుతాడు, జిమ్ కి వెళుతాడు, ఏం కొన్నా తినిపిస్తాడు, టీవి చూస్తాడు, బయట షికారుకి తీసుకెళతాడు. ఓరినీ పిచ్చి పిజ్జా హట్ లో పెట్టా అని మీరు ఆశ్చర్యపోతున్నారని తెలుసు. ఈ పాముని ఏకంగా పెళ్ళి చేసుకున్నాడు. తన ప్రేయసి చనిపోయి తనదగ్గరికి ఈ రూపంలో వచ్చిందని వితండవాదం చేస్తున్నాడు. ఏంటో ఈ వింత లోకం, ప్రేమ గుడ్డిదని తెలుసు కాని, మరీ ఇంత గుడ్డిదని ఇప్పుడే తెలిసింది

No comments:

Post a Comment

About

Flickr