Nestham Movie Creations

Wednesday, 16 November 2016

ఐష్.. మరో సర్‌ప్రైజ్!


ఇటీవలి ‘ఏ దిల్ హై ముష్కిల్’ సినిమాతో తన పూర్వపు అందాలతో ప్రేక్షకులకు కనువిందు చేసింది బాలీవుడ్ హాట్ గాళ్ ఐశ్వర్య రాయ్ బచ్చన్. అభిషేక్ బచ్చన్‌తో వివాహం అనంతరం సినిమాలు చేసినప్పటికీ గతంలో చేసిన రొమాంటిక్ సినిమాలకు దూరంగానే ఉంది ఐశ్వర్య. కానీ ఇటీవల వచ్చిన్ కరణ్ జోహార్ సినిమాతో పాత ఐశ్వర్యను గుర్తుకు తెచ్చిన ఈ భామ మరో సర్‌ప్రైజ్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ప్రకటించింది. తనకు సర్‌ప్రైజ్ ఇవ్వడం అంటే చాలా ఇష్టమని త్వరలో అటువంటి మరో వార్తతో తన అభిమానులను ప్రకటిస్తానని చెప్పుకొచ్చింది. ఏ దిల్ హై ముష్కిల్ సినిమాలో షారూక్ ఖాన్, ఐశ్వర్య మధ్య సన్నివేశాలకు ప్రేక్షకుల నుంచి స్పందన బాగుండడంతో ఈ జంటతో ఒక సినిమాను ప్లాన్ చేయాలని కరణ్ జోహార్ ఆలోచిస్తున్నట్లు, దీనికి ఐష్‌తో పాటు, షారూక్ సైతం అంగీకరించినట్లు వార్తలు రావడంతో మీడియా ఐశ్వర్యను సంప్రదించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఐష్.. తాను ఇప్పటి వరకు ఏ సినిమాకు సైన్ చేయలేదని, అవన్నీ ఒట్టి పుకార్లేనని, అయితే కచ్చితంగా సర్‌ప్రైజ్ మాత్రం ఉంటుందని చెప్పుకొచ్చింది.

No comments:

Post a Comment

About

Flickr