Nestham Movie Creations

Thursday, 17 November 2016

జగపతిబాబుతో మందు కొట్టించి..


Image result for krishna vamsiమాటకు ముసుగేయకుండా మాట్లాడే దర్శకుడు కృష్ణవంశీ. ఆయనతో ఓ పది నిమిషాల ఇంటర్వ్యూ అంటేనే చాలా బాంబులు పేలుతాయి. ఇప్పుడాయన ఓ సుదీర్ఘ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర అంశాలపై కృష్ణవంశీ స్పందిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంకా ఫుల్ ఇంటర్వ్యూ బయటికి రాలేదు కానీ.. ప్రివ్యూతోనే ఆ ఇంటర్వ్యూ సంచలనం రేపుతోంది. 'అంత:పురం' సినిమాలో జగపతి బాబుతో ఐదు రోజుల పాటు కొన్ని సన్నివేశాలు తీశాడట కృష్ణవంశీ. ఆ ఐదు రోజులూ జగపతితో మందు కొట్టించాడట కృష్ణవంశీ. షాట్ ఆరంభం కావడానికి ముందు అతడికి టకీలా ఇచ్చి రంగంలోకి దింపేవాడినని వెల్లడించాడు కృష్ణవంశీ. మురారి టైంలో తనకు.. నిర్మాతకు మధ్య నడిచిన గొడవ.. కృష్ణ దగ్గర పంచాయితీ గురించి కూడా ఈ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు చెప్పాడు కృష్ణవంశీ. తనకు ఓ దశలో అత్యంత ఆత్మీయుడిగా ఉన్న ప్రకాష్ రాజ్ తో ఆ తర్వాత విభేదాలు ఎందుకొచ్చాయో కృష్ణవంశీ ఈ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. తాను తీసిన ఓ మంచి సినిమా ఆడకపోవడంపై బాధపడుతుండగా.. ప్రకాష్ రాజ్ అన్న ఒక మాటతో గొడవైందని కృష్ణవంశీ చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో రివ్యూయర్లపై కృష్ణవంశీ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. వారం రోజుల పాటు రివ్యూలు రాయకూడదని.. జనాల్ని రివ్యూయర్లు ప్రభావితం చేయాలని చూడకూడదని కృష్ణవంశీ అన్నాడు. ''మధ్యలో నువ్వెవడివిరా..'' అంటూ సమీక్షకులపై కృష్ణవంశీ తన అసహనాన్ని ప్రకటించాడు కృష్ణవంశీ. ఈ శుక్రవారమే ఆ ఇంటర్వ్యూలో యూట్యూబ్ లోకి రానుంది.

No comments:

Post a Comment

About

Flickr