Nestham Movie Creations

Friday, 18 November 2016

వెండితెరపై గీతామాధురి..


వెండితెరపై గీతామాధురి..వెండితెరపై గీతామాధురి.. వియ్ ల‌వ్ బ్యాడ్ బోయ్స్‌.. మ‌గాళ్లు వ‌ట్టి మాయ‌గాళ్లు..! అంటూ తన గాత్రం ఆకట్టుకున్న న‌వ‌త‌రం గాయ‌ని గీతామాధురి. ట్రెడిష‌న‌ల్ సాంగ్స్‌, మెలోడీస్, ఫాస్ట్ బీట్ వెస్ట్రన్ సాంగ్స్, హ‌స్కీ ఐటెమ్ నంబ‌ర్ల‌తో త‌న‌దైన స్పీడ్ చూపించిన‌ ఈ యువ గాయ‌ని లుక్స్ స్టైల్స్ తోను మెప్పిస్తోంది. ఇటీవ‌లే `అతిథి` అనే షార్ట్ ఫిలింలో లీడ్ రోల్ పోషించిన గీతామాధురి త్వరలోనే వెండితెర మీద కూడా సందడి చేయనుందట. అయితే త్వరలో రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాలో గీతామాధురి హీరోయిన్ గా నటిస్తుందా..? లేక అతిథి పాత్రలోనే కనిపించనుందా అన్న విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే సింగర్ మంచి క్రేజ్ సొంతం చేసుకున్న గీతా, ఈసినిమా రిలీజ్ అయిన తరువాత నటిగానూ బిజీ అవుతుందన్న టాక్ వినిపిస్తోంది. త్వర
లోనే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ రానుంది.

No comments:

Post a Comment

About

Flickr